హైదరాబాద్

ఇదేం పద్ధతి గౌడ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ‘మననగరం’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎల్బీనగర్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ ఇన్‌చార్జి చేసిన హడావుడి గమనించిన మంత్రి కేటీఆర్ మందలించారు. జీహెచ్ ఎంసీ తూర్పుజోన్ పరిధిలో ఇటీవల నాగోల్‌లో నిర్వహించిన మననగరం కార్యమ్రంలో పలు ప్రార్టీల ప్రజాప్రతినిధులు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధుల పలు సమస్యలను లేవనెత్తారు. దీంతో త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సోమవారం గడ్డి అన్నారం జోనల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత ఉప ముఖ్యమంత్రితో కలిసి అధికారులతో కేటీ ఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు కాలనీలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశంమయ్యారు. సమావేశం ముగింపు దశకు చేరుకునే సమయంలో ఎల్బీనగర్ టీ ఆర్ ఎస్ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ సమావేశంలోనే స్థానికులతో మాట్లాడుతూ హడావుడి చేశారు. సమావేశం పూర్తికాక ముందే రామ్మోహన్ బిగ్గరగా మాట్లాడుతుండటంతో అంతరాయం ఏర్పడింది. ఇది గమనించిన మంత్రి కేటీఆర్ ఒకింత అసహనానికి గురయ్యారు. దీంతో ఏమండీ రామ్మోహన్ గౌడ్ గారు అప్పుడే అంతా అయిపోయిందా.. ఇదేం పద్ధతి క్రమశిక్షణ అవసరం అన్నట్టుగా అర్ధం వచ్చేలా అనడంతో సమావేశ మందిరం అంతా నిశబ్ధమైంది . అనంతరం మంత్రి తన కార్య క్రమాన్ని కొనసాగించారు.