హైదరాబాద్

అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే సమాజాభివృద్ధి: కలెక్టర్ యోగిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అన్ని వర్గాల భాగస్వామ్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ యోగితా రాణా పేర్కొన్నారు. ‘బేటీ బచావో-బేటీ పడావో’కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇందిర ప్రియదిర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య, పౌష్ఠికాహారం, అందజేయటంతో పిటు పిల్లల సంరక్షణ విషయం కూడా టీచర్లదే బాధ్యత అని గుర్తుచేశారు. లైంగిక వేధింపులు, రుతు పరిశుభ్రత, పౌష్టికాహారం అందించటం వంటి అంశాలపై ఎస్‌ఎంసీ సభ్యులతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. పిల్లలు తమని తాము రక్షించుకునే విధంగా అవాంఛనీయ స్పర్శల పట్ల పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఇబ్బంది కరంగా ఉంటే ప్రశ్నించే తత్వాన్ని పిల్లలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ అంశంపై ఇంటా బయటా విస్తృత స్థాయిలో చర్చ జరగాలని చెప్పారు. పిల్లలకు సురక్షిత ప్రాంతంగా స్కూల్ ప్రాంగణం ఉండేలా తీర్చిద్దటంలో ఎస్‌ఎంసీలదే ముఖ్యమైన బాధ్యత అని గుర్తుచేశారు. కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణలో భాగంగా పది సంవత్సరాల వయస్సు నుంచే రుతుక్రమం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వ హై స్కూల్స్, సంక్షేమ వసతి గృహాల్లో ఆరో తరగతి నుంచి 10వ తరగతి బాలికలందరికీ బీఆర్‌ఎస్‌కే ద్వారా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించి, ఎనిమిది శాతం కంటే తక్కువ ఉంటే ఐరన్ ఫొలిక్ మాత్రలతో పాటు రాగి లడ్డూలను ఇవ్వనున్నట్లు తెలిపారు.
మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జీ. వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ సమాజం ఎదుర్కొంటున్న కొత్త సమస్యల పిల్లలపై లైంగిక్ అత్యాచారాలు, అత్యాచారం జరిగిన తరువాత వారికి న్యాయం చేస్తున్నామా అని విచారణ చేయటం కంటే నేరాలు జరగకుండా ఏ విధంగా ఆరికట్టగలమనే విషయాన్ని తెలుసుకుని ఆచరించాలని సూచించారు. తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పించాలని, పరిసర ప్రాంతాల్ల, నిర్జీవ ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులతో వెళ్లటం, బంధువుల ఇళ్లలో ఉంచటం వంటి అంశాలల్లో పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలు, రూల్స్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి సమస్యను పరిష్కరించటంలో భాగస్వాములు కావాలని సూచించారు. సదస్సులో డీఎంహెచ్‌ఓ డా.పద్మజ, డీఈఓ వెంకటనర్సమ్మ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఇంతియాజ్, జిల్లా వెల్ఫేర్ అధికారి సునంద, ఆర్‌బీఎస్‌కే ప్రతినిధి శ్రీకళ పాల్గొన్నారు.

ప్రపంచ శాంతికి బస్సు ప్రచార యాత్ర
చార్మినార్, జూన్ 19: ప్రపంచంలో శాంతి స్థాపనకు యువతలో సామాజిక మార్పును కల్గించేందుకు ప్రత్యేక బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు శాంతి సరోవర్ బ్రహ్మకుమారీస్ డైరెక్టర్ కుల్‌దీప్ వెల్లడించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసినా విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ యువతలో ఆరోగ్యకరమైన జీవన విధానంతో నైతిక విలువలను పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ యాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ వైపు ఆశావాహ దృక్పధాన్ని, నైతిక మానవ విలువలను పెంపొందిస్తు బ్రహ్మకుమారీల యువ విభాగం 1985 నుండి యువశక్తి అభివృద్ధి కోసం పాటుపడుతోందని అన్నారు. మూడేళ్ల పాటు కోనసాగే ఈ బస్సు యాత్ర గత సంవత్సరం జూన్ 20న వౌంట్‌ఆబులోప్రారంభమై దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అనేక పట్టణాల మీదుగా కొనసాగుతుందని వివరించారు. ఈ నెల 20న బుధవారం హైదరాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్‌ల యువ కేంద్రాల ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మేళనంలో అన్ని విభాగాలకు చెందినవారు పాల్గొంటారని, కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ నరసింహన్ పాల్గొనున్నట్లు తెలిపారు. దేశంలోని నలుమూలల ప్రాంతాలకు చెందిన ఆసక్తిగల యువకులు బస్సు యాత్రలో పాల్గొనున్నట్లు తెలిపారు. సామాజిక మార్పును, పరివ్తనను సమాజంలో కలిగించటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రత్యకంగా డిజైన్ చేసిన ఈ బస్సు ఎగ్జిబిషన్ స్వచ్ఛ్భారత్, ఆధ్యాత్మిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, యోగా, ధ్యానం చేయటం పట్ల అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో బ్రహ్మకుమారీలు బీకే మంజు, బీకే షీలా, సరళ, డా.పీజే సుధాకర్, వంశీ పాల్గొన్నారు.