హైదరాబాద్

నాటి మురికి కూపం నేడు ఉద్యానవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీవాసులకు మరో ఆహ్లాదకరమైన పార్కు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన మీరాలం పార్కు అందుబాటులోకి రాగా, నేటి నుంచి కిషన్‌బాగ్ పార్కు కూడా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనుంది. గతంలో మురికికుంటగా కన్పిస్తూ, తీవ్ర దుర్వాసనను వెదజల్లుతూ, పిచ్చి మొక్కలు, పందుల స్వైరవిహారంతో కన్పించే ఈ కుంట నేడు చక్కటి ఉద్యానవనంగా దర్శనమిస్తోంది. నగరంలోని ఖాళీ స్థలాలను పచ్ఛదనంతో నింపి, అందమైన పార్కులుగా తీర్చిదిద్దటంపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంటూ మురుగునీరు, పిచ్చి చెట్లతో నిండిన ఈ కుంటను జీహెచ్‌ఎంసీ అధికారులు రూ. 6.20 కోట్లతో అందంగా అభివృద్ధి చేశారు. రూ. 5.45 కోట్లతో సివిల్ పనులు, రూ.35 లక్షలతో గ్రీనరీ, మొక్కలు నాటడం, రూ. 40లక్షలతో ఆకర్షనీయమైన లైటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ నిధులతో కిషన్‌బాగ్ కుంట మొత్తం నాలుగు ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీగోడను కూడా ఏర్పాటు చేశారు. మరింత రక్షణ కోసం గోడపై గ్రిల్స్‌ను కూడా సమకూర్చారు. వర్షపు నీరు సులువుగా వెళ్లటానికి వీలుగా స్టార్మ్ వాటర్‌డ్రెన్‌ను నిర్మించారు. ఈ కుంటలో అంతర్గతంగా పార్కును అభివద్ధృ చేసి నడకదారులను నిర్మించారు. అంతర్గత, బహిర్గతంగా పాత్‌వేలను ఏర్పాటు చేశారు. కిషన్‌బాగ్ పార్కు ప్రవేశ ద్వారం చూపర్లను ఆకట్టుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. పార్కులో ఏర్పాటు చేసిన కుర్చీలు, బల్లలను అందుబాటులో ఉంచగా, ఆ సీట్లలో సందర్శకులు కూర్చోగానే వెలుగులు జిమ్మే త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయటం ప్రత్యేక ఆకర్షణ. కరెంటు వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. పార్కును బుధవారం మున్సిపల్ మంత్రి కే.తారక రామారావు ప్రారంభించినున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.