హైదరాబాద్

సిటీ అభివృద్ధిలో కేటీఆర్ ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిమ్మిటి శ్రీ్ధర్
హైదరాబాద్: మహానగరాభివృద్ధిలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు తనదైన ముద్ర వేస్తున్నారు. నగరంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. సమైక్యాంధ్రలో అనేక మంది మంత్రులు ఇలాంటి ప్రజాసమస్యల పరిష్కారానికి పలు కార్యక్రమాలను నిర్వహించినా, ప్రస్తుతం కేటీఆర్ నిర్వహిస్తున్న మన నగరం కార్యక్రమంలో మాదిరిగా స్థానికులు, స్థానిక సంక్షేమ సంఘాలు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయలేకపోవటంతో అవి ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదని చెప్పవచ్చు. కేవలం ఎన్నికల సమయంలో మొక్కుబడిగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించే వారు. గతంలో ఏ మున్సిపల్ మంత్రి నిర్వహించని స్థాయిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక ఎమ్మెల్యేలను సైతం భాగస్వాములను చేస్తూ నిర్వహిస్తున్న ‘మన నగరం’ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. స్థానికంగా ఉన్న కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్చంద సంస్థలను రాజకీయాలకతీతంగా ఆహ్వానించి వారి సమస్యలను తెలుసుకోవటంతో పాటు అప్పటికపుడే పరిష్కారాన్ని సూచించటం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఎక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినా, సభాస్థలికి దూరంగా ఉన్న ప్రజలను సైతం చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఆకట్టుకోవటం మంత్రి స్పెషాల్టీ. కొద్దిరోజుల క్రితం ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ‘మన నగరం’కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి ఆ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన సమస్యల పరిష్కారం, వాటి పురోగతిపై రెండురోజుల క్రితం ఎల్‌బీనగర్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థలాల క్రమబద్దీకరణకు ప్రభుత్వం గతంలోనే జారీ చేసిన జీవోలు 58, 59 కింద ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని ప్రకటించిన మంత్రి ఎఫ్‌టీఎల్‌లో నిర్మితమైన భవనాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ఖరాఖండిగా చెప్పటం మంత్రి నిబద్దతకు నిదర్శనం. అంతేగాక, నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గతంలో ఎన్నడూ లేని విధంగా స్వరాష్ట్రం, స్వపరిపానలో సర్కారు రూ.22వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) పథకానికి శ్రీకారం చుట్టారు.
తొలి దశగా జరుగుతున్న పనులకు సంబంధించి పలు ప్రాంతాల్లో స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యను కూడా మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరిస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టు స్థల సేకరణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పరిష్కారమయ్యేందుకు మంత్రి సలహాలే బాగా పనిచేశాయని నేటికీ కొందరు అధికారులు గుర్తుచేసుకోవటం కేటీఆర్ ముందు చూపునకు, వ్యూహారచన శైలికి నిదర్శనంగా చెప్పవచ్చు. కొద్ది నెలల క్రితం అసెంబ్లీలో చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్టు పనులపై మజ్లిస్ ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను సైతం ఎంతో చాకచక్యంగా ఎదుర్కొన్న మంత్రి ఆ మరుసటి రోజే చార్మినార్‌ను సందర్శించి, పనులను పరిశీలించారు. పనులు మరింత వేగవంతంగా ముందుకు సాగేందుకు ప్రత్యేకంగా ఓ ఇన్‌చార్జి అధికారిని నియమించి, పనులకు నిర్ణీత గడువులను విధించి, తరుచూ సమీక్షిస్తున్నారు.
‘ట్విట్’కు క్విక్ సమాధానం
మహానగరంలోని ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎపుడు ట్విట్ చేసినా, క్విక్‌గా స్పందించటం, అందుకు సమాధానమివ్వటం మంత్రి కేటీఆర్ ప్రత్యేకత. రోడ్ల మరమ్మతులు, దోమల నివారణ వంటి అంశాలకు ఇప్పటికే మంత్రి ట్విట్‌లో స్పందించటంతో పలువురు నగర పౌరుల సమస్యలు పరిష్కారం కావటంతో హర్షం వ్యక్తమైంది.
అంతేగాక, ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నపుడు తనకు రెండు టికెట్లు ఇప్పించగలరా? అంటూ ఓ పౌరుడు చేసిన ట్విట్‌కు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందిస్తూ నా వల్ద కాదు బాబోయ్! అంటూ సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
నేడు మళ్లీ పర్యటన
రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల కన్నా జీహెచ్‌ఎంసీ పరిధిలోని కోటి మంది జనాభాకు వౌలిక వసతులు, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రి కేటీఆర్ బుధవారం మరోసారి నగరంలో పర్యటించనున్నారు. పాతబస్తీలోని కిషన్‌బాగ్‌లో రూ. 6.20 కోట్లతో అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించనున్న మంత్రి మైట్రోరైలు పనులను కూడా తనిఖీ చేయనున్నారు.