హైదరాబాద్

సెంచరీ సాధించిన తన్మయ్ అగర్వాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏ-1 డివిజన్ మూడు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం స్పోర్టింగ్ ఎలెవన్-దక్కన్‌క్రానికల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేపట్టిన స్పోర్టింగ్ ఎలెవన్ మొదటి ఇన్నింగ్స్‌ను చేపట్టింది. గ్రూప్-ఏలో జరిగిన మ్యాచ్‌లో స్పోర్టివ్ జట్టులో తన్మయ్ అగర్వాల్ 265 బంతులనెదుర్కొని పది బౌండరీలు, నాలుగు సిక్సర్ల సహయంతో 126 పరుగులతో సెంచరీ, హమలయ్ అగర్వాల్ 83 పరుగులు చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. దక్కన్ క్రానికల్ బౌలర్ ఎం.పృధ్వీ 53 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
గ్రూప్-బీలో కేమ్‌బ్రిడ్జ్ ఎలెవన్-ఏన్స్‌కోన్స్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సరికి కేమ్‌బ్రిడ్జీ ఎలెవన్ జట్టు 88 ఓవర్లలో తొమిది వికెట్ల నష్టానికి 301 పరుగులు సాధించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన జే.మల్లిఖార్జున్ 65, ఆరీస్ జైదీ 61, అమీర్ మాలిక్ 42, అలంక్రిత్ అగర్వాల్ 33 పరుగులు చేశారు. ఏన్స్‌కోన్స్ క్రికెట్ క్లబ్ జట్టు బౌలర్ అజారుద్ధిన్ 27 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.