హైదరాబాద్

ఎన్‌సీసీతో మానసిక, శారీరక దృఢత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒకప్పుడు ఎన్‌సీసీలో చేరాలంటే చాలా తక్కువ మంది ఆసక్తి చూపించే వారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎన్‌సిసి ఉన్న కళాశాలలు, పాఠశాలలను ఎంపిక చేసుకుని తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఎన్‌సీసీలో చేరిన విద్యార్ధినీ, విద్యార్థులకు మానసిక, శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా సామాజిక బాధ్యత, అన్నింటికీ మించి చక్కటి క్రమశిక్షణ అలవడుతుంది. ఇక ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ఎన్‌సిసి అభ్యర్థులకు ఉన్న రిజర్వేషన్ కోటాను సక్రమంగా వినియోగించుకుని లబ్ధి పొందేందుకు యువతలో ఎన్నో రెట్లు ఆసక్తి పెరిగింది. రక్షణ దళాల్లో ఉండే క్రమశిక్షణ, పద్ధతులు, జీవన శైలి, ఆత్మవిశ్వాసం, వంటి అనేక అంశాలను ప్రభావితం చేసే విధంగా ఎన్‌సిసి శిక్షణ ఉంటుంది. ప్రతి పాఠశాల స్ధాయి నుంచి ఎన్‌సీసీని ఏర్పాటు చేయడం ద్వారా ఒక బాధ్యతాయుత పౌరులను సమాజానికి అందించిన వాళ్లమవుతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. క్రమశిక్షణతో కూడిన జీవితం కోరుకునే యువత ఎన్‌సిసిలో తప్పక చేరాలని ఎన్‌సిసి లెఫ్టినెంట్ డాక్టర్ దీపికారావు తెలిపారు. పది రోజుల పాటు జరిగే ‘3వ వార్షిక శిక్షణ శిబిరం’ బైసన్‌పోలో మైదానంలో ఈ నెల 20 నుంచి ప్రారంభమైంది. సికింద్రాబాద్ గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ 1 బాలికల బెటాలియన్ ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో 652 మంది ఎన్‌సిసి క్యాడెట్లు పాల్గొన్నారు. ఆర్మీకి చెందిన నిపుణులు, సైకాలజిస్ట్‌లు, సామాజిక వేత్తలు ప్రత్యేకించి ఈ శిబిరంలో తరగతులు నిర్వహించడం ద్వారా క్యాడెట్ల ఆలోచన తీరులో మార్పు తెస్తున్నారు. రక్షణ దళాల్లో అధికారి హోదాలో ఉద్యోగంలో చేరాలంటే సైకాలజీ టెస్ట్ అత్యంత కీలకమైనది. మిగిలిన పరీక్షలతో పాటు ఈ పరీక్షలో విజయం సాధిస్తేనే రక్షణ దళాల్లో ఉద్యోగం పొందేందుకు అర్హులవుతారు. ఇందుకు అనుగుణంగా ఎన్‌సిసి క్యాడెట్లను మానసికంగా సిద్ధం చేసేందుకు అనువుగా ఈ శిక్షణను డిజైన్ చేసి అందిస్తామని డాక్టర్ దీపికారావు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న క్యాడెట్లను ఉదయం డ్రిల్ నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలకు సిద్ధం చేస్తారు. వీరికి పోషకాహారంతో కూడిన అల్పాహారం, భోజనం, స్నాక్స్‌ను అందిస్తున్నారు. ట్రాఫిక్ పట్ల అవగాహన, సామాజిక బాధ్యత, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎలా నెగ్గుకు రావాలి, ఆ పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మస్ధైర్యం వంటి అంశాలు ఈ శిబిరం ద్వారా క్యాడెట్లు నేర్చుకుంటున్నారు. మరో లెఫ్టినెంట్ మారీ థామస్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్ట్ఫికెట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారిని ప్రత్యేకంగా అభినందించి సర్ట్ఫికెట్లు ఇస్తామని తెలిపారు. చదువుతో పాటు క్రమశిక్షణకు మారుపేరైన ఎన్‌సిసి సర్ట్ఫికెట్ కలిగి ఉంటే సమాజంలో గౌరవం మరింత పెరుగుతుందని ఆమె తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ (సిఓ)గా చంద్రశేఖరరావు వ్యవహరిస్తున్నారు.