హైదరాబాద్

చిరునవ్వుతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆకాంక్షించారు. రక్షణ కోరి వచ్చే ప్రతి ఒక్క బాధితునితో ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించి వారి బాధను తీర్చాలని అన్నారు. ఆదివారం నాడిక్కడ ఫలక్‌నుమా పోలీసు స్టేషన్ పరిధిలోని 275 కుటుంబాలతో సిపి సమావేశమయ్యారు. వీరందరితో సిపి కలిసిపోయి సరదాగా గడిపారు. పోలీసు కుటుంబాల పిల్లలతో మాట్లాడి వారి ఆకాంక్షలను, తల్లిదండ్రులు అందిస్తున్న ఆదరణ, జీవిత లక్ష్యాలు వంటి విషయాలపై చర్చించారు. పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు కొందరు ఇంత అద్భుతమైన కార్యక్రమం ఎప్పుడూ జరగలేదని, తమ భర్తలు పోలీసు స్టేషన్‌లో పని చేసే తీరు ఎలా ఉంటుందని, వారి విధుల గురించి గతంలో ఎప్పుడూ చూసిన దాఖలాలు లేవని సంబుర పడ్డారు. ఈ సందర్భంగా పోలీసు కుటుంబాలకు మిఠాయిలు, చాక్‌లెట్లు పంపిణీ చేశారు. పోలీసు స్టేషన్లలో పని చేసే వాతావరణం మంచిగా ఉండాలని చెప్పారు. పలువురు తమ భర్తలు, తమ తండ్రులు పని చేసే స్టేషనలో ఉన్న పరిస్థితులను స్వయంగా చూడడం పట్ల సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేశారు. సిపి స్వయంగా ఈ సమావేశానికి హాజరు కావడంతో చాలా మంది ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.