హైదరాబాద్

విద్యుదాఘాతంతో... దంపతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట్: విద్యుత్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందా రు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మం డలం పాపిరెడ్డి గూడ గ్రామ శివారులోని మామిడితోటలో పని చేస్తున్న వెంకట్రాజు (36), దుర్గ (32) భార్యాభర్తలు. ఆదివారం రాత్రి తోటలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైరు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త ఎంతకీ రాకపోవడంతో భార్య వెళ్లి చూసే సరికి కిందపడిపోయి ఉన్నాడు. విద్యుత్ షాక్ తగిలి భర్త చనిపోయినట్లు గ్రహించని భార్య అతడిని లేపేందుకు ప్రయత్నించగా ఆమె కూడా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించింది. మృతులు కాకినాడకు చెందిన వారుగా గుర్తించారు. వీరిద్దరు జీవనోపాధి కోసం కేశంపేటకు వచ్చినట్లు చెబుతున్నారు.