హైదరాబాద్

తగ్గిన భూగర్భజలాలు.. ఎండిపోతున్న బోర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, ఏప్రిల్ 1: వేసవి ఎండలు ఏప్రిల్‌లోనే మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల దాటిందంటే బయటకు వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నారు. విద్యార్థులు ఒంటిపూట బడులకు వెళ్లాలంటే వెనుకంజ వేస్తున్నారు. ఎండలు మండిపోవటంతో ప్రతి ఒక్కరి గొంతులు ఎండిపోయి చల్లటి పానీయాల వైపు చూస్తున్నారు. అల్వాల్ ప్రాంతంలో సైతం నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి సరాఫరాలైను ఉన్న ప్రాంతంలో గతంలోకన్నా మెరుగుగా సరాఫరా చేస్తున్నారు. కాని పూర్తి స్థాయిలో నీటి సమస్యను తగ్గించలేక పోతున్నారు. కొన్నిచోట్ల రోజు విడచి రోజు, మరికొన్నిచోట్ల మూడు రోజులకు ఒక్కసారి మాత్రమే నీటి సరాఫరా చేస్తున్నారు. అల్వాల్ సర్కిల్ పరిథిలో 132 మచ్చబొల్లారం, 133 అల్వాల్, 134 వెంకటరావుపేట డివిజన్‌లలో కల్సి 9 వేల నీటిసరాఫరా కనెక్షన్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అల్వాల్‌లో కొత్తగా నీటి కనెక్షలు ఇంకా మంజూరీ చెయ్యవల్సిన అవసరం ఉంది. ఉన్న కనెక్షన్‌లకు నీటి సరాఫరా చెయ్యలేక పోతున్నారు. ఇటీవల కాలంలో నీటి సరాఫరా మెరుగు పడ్డా ఇంకా చెయ్యాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం ఇంటి ఇంటికి నల్లా కనెక్షన్‌లు ఇస్తామనీ ప్రకటనలు చేస్తుంది కాని దానికి కావల్సిన నీటి సరాఫరా లైన్‌ల ఏర్పాటు జరగటంలేదు . మరోవైపు ఎండలు మండిపోవటంతో భూగర్భంలో నీటి మట్టాలు తగ్గిపోయి ఇండ్లలోని బోర్‌వెల్‌లు ఎంపోతున్నాయి అల్వాల్, వెంకటాపురం డివిజన్‌లలో ఇందిరానగర్, కానాజిగుడా, దొడ్డి అల్వాల్, భూదేవీనగర్, వెంకటారావుపేట ప్రాంతంలో వంద నుండి రెండు వందల అడుగులలోతులో బోర్‌వెల్‌లో నీరు వచ్చేది. కాని ప్రస్తుతం 500 నుండి వెయ్యిఅడుగుల వరకు బోర్‌వేసినా నీరు రావటంలేదు. చాలచోట్ల వేసిన బోర్‌లలో నీరు పడటంలేదు. ఒకవేళ నీరు పడినా అనుకున్న స్థాయిలో నీరు రావటంలేరు. మచ్చబొల్లారం డివిజన్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఉందనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మచ్చబొల్లారంలోని జొన్నబండలో మొదటి నుండి భూగర్భజలాల సమస్య ఉందనీ అక్కడి ప్రాంతంలో ఇంటి స్థలాలు కొనుగోలు చెయ్యాలంటే నీరులేదనీ మాని వేస్తున్నారు. ఫాదర్ బాలయ్యకాలనీ, హెచ్‌ఎంటి ఎంప్లాయిస్ కాలనీ, అల్వాల్‌సిటీ, రుక్మిణి ఎన్‌క్లేవ్, సాయినగర్, బృందావన్ కాలనీ, రైల్వే ఎంప్లాయిస్ కాలనీ, సంతోషిమాత కాలనీ, సిటిజన్ కాలనీ, మచ్చబొల్లారం, కృష్ణనగర్ కాలనీలో అంతఅంత మాత్రంగానే నీటి సరాఫరా జరుగుతుంది. తుర్కపల్లి- బందం ప్రాంతంలో నీటిని రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వార నీటిని సరాఫరా చేస్తున్నారు. కౌకూర్ ప్రాంతానికి ఎప్పుడు నీటి సమస్య ఉంది. స్థానికంగా బోర్‌వెల్ ద్వారనే నీటి సరాఫరా చేస్తున్నారు. కౌకూర్, బర్షపేట, రాజీవ్ వీకర్ సెక్షన్, భరత్‌నగర్, సంజయ్ గాంధీ నగర్‌లో నీటి ఎద్దడి తీర్చటానికి ప్రతిపాదలు ఉన్నాయి. ఇంకా అవి ప్రారంభ దశలోనే ఉన్నాయి . కాని తక్షణమే నీటి సమస్య తగ్గే అవకాశంలేదు . అల్వాల్ మున్సిపాలిటీ ప్రాంతానికి ఫాదర్‌బాలయ్య కాలనీ ట్యాంకు వద్ద ఒక ఎంజిడి, యాప్రాల్‌లో ఒక ఎంజిడి, లోతుకుంటలో 1.5 ఎంజిడి నీటిని జలమండలి ప్రతి రోజు 3.5 ఎంజిడి నీటిని సరాఫరా చేస్తున్నారు.
కాని వేసవిలో ఇంకా అదనంగా నీటిని సరాఫరా చెయ్యలేక పోతున్నారు. అల్వాల్ ప్రాంతంలో పూర్తిస్థాయిలో స్థానిక కాలనీలు, బస్తీలు, పాత బస్తీల్లో నీటిసరఫరా లైన్‌లు లేని కారణంగా సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్వాల్‌లో ఉన్న మూడు డివిజన్‌లలో పూర్తి స్థాయిలో పైపులైన్‌లు వెయ్యటానికి 190 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశారు. దానికి సంబందించి పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తిస్థాయిలో జరిగితే నీటి సమస్య తీవ్రత తగ్గనుందని భావిస్తున్నారు.