హైదరాబాద్

ఎమ్మెల్యే నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్1: ఎమ్మెల్యేల నియోజకవర్గం అభివృద్ధి నిధులతో పాత నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నిర్ణయించారు. శాసన మండలి సభ్యునిగా తనకు నియోజక వర్గ అభివృద్ధి నిధుల కింద వచ్చే వాటిలో ఏడు కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు. పాత నగరంలోని డబీర్‌పురాలో ఉన్న టిబి ఆస్పత్రి స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తారు. మొత్తం ఏడు కోట్లు దీనికి వ్యయం చేయనున్నారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన నిధుల నుంచి మొదటి విడతగా 75లక్షలు ఇచ్చారు. 2016-17 నిధుల నుంచి 1.75 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు, నిర్మాణ పురోగతిని బట్టి మిగిలిన 4.5 కోట్ల రూపాయలు దశల వారిగా ఇవ్వనున్నట్టు మహమూద్ అలీ తెలిపారు. ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1938లో ఈ ఆస్పత్రిని నిర్మించారని తెలిపారు. తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఆస్పత్రిని పట్టించుకోలేదని చెప్పారు. ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మాదన్నపేటలో గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్టు పేర్కొన్నారు.