క్రైమ్/లీగల్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూలై 11: రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధి యంనంపేట్ సమీపంలో పోచారం ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వినోద్(25) బుధవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. మృతుడు ప్రకాశం జిల్లా గిద్దలూర్ చెందినవాడని, కీసర మండలం నాగారంలో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాజేంద్రనగర్, జూలై 11: రంగారెడ్డి జిల్లా పరిధిలో అక్రమంగా విదేశీ మద్యాన్ని విక్రయించే ఇద్దరిని ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సుమారు రూ.40 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని రాజేంద్రనగర్‌లోని ఎక్సైజ్ కార్యాలయం ఆవరణలో రోడ్‌రోలర్‌తో ధ్వంసం చేశారు. కేసులో మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ అజయ్ రావు మాట్లాడుతూ... ఎక్సైజ్ చట్టాన్ని అతిక్రమించి నలుగురు వ్యక్తులు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే కొందరు వ్యక్తుల నుంచి గత ఏడాది కాలంగా విదేశీ మద్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్జాతీయ విమానాశ్రయం, నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నట్లు సమాచారం అందుకున్నామని చెప్పారు. విక్రయాలు కొనసాగించేది టోలిచౌకీ ప్రాంతానికి చెందిన శివ పాటిల్, హరీష్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్నామని వివరించారు. శివ పాటిల్ పేరుమోసిన నేరస్థుడిగా తేలడంతో అతనిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో తొమ్మిది ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 460 కేసులు నమోదై ఉన్నట్లు వివరించారు. సుమారు 640 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమంగా గంజాయి విక్రయించినా, సరఫరా చేసినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా జోన్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ ఖురేషీ, హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వివేకానందా రెడ్డి, శంషాబాద్ జోన్ సూపరింటెండెంట్ జీ.జనార్ధన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.