హైదరాబాద్

తెలంగాణలో దొరల పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 11: తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డినగర్‌లో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామి యాత్రను అడ్డుకోవడాన్ని ఖండించారు. దివాకర్ మాట్లాడుతూ హిందువులు యాత్ర చేస్తే ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే నేతలు పరిపూర్ణానంద స్వామి పాదయాత్రను అడ్డుకోవడం సిగ్గు చేటని ద్వజమెత్తారు. హిందుత్వంపై దాడులు చేస్తే ఊరుకోమని, అహంకార పోకడలు ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసే ఎంఐఎం నేతలను నగర బహిష్కరణ ఎందుకు చేయలేరని నిలదీశారు. హిందువుల ఓట్లు అవసరం లేదా అని హిందూ నేతలను ప్రశ్నించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున టీఆర్‌ఎస్ పార్టీ హిందువుల మనోభావాలను కించ పరిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రంగా శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, గోపాల్, పరిశె వేణు, దీపక్, డీజే పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి అన్నారు.
షాపూర్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గం పార్టీ కన్వీనర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో దత్తాత్రేయ నగర్ నుంచి యువకులు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరారు. మల్లారెడ్డి వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానం పలికారు. మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈనెల 13న బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు బీజేపీ నేత అమిత్ షా విచ్చేస్తున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ర్యాలీగా తరలివెళ్లి స్వాగతం పలకాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు నందనం దివాకర్, నట్‌రాజ్ గౌడ్, రాజాగౌడ్, రాజిరెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్ చేరుకున్న శరత్ భౌతికకాయం
హైదరాబాద్, జూలై 11: అమెరికాలో ఉన్మాది కాల్పుల్లో మరణించిన శరత్ కొప్పు భౌతికకాయం బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నది. భౌతికకాయాన్ని అధికారులు శరత్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. భౌతికకాయాం అమెరికా నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నట్లు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ బీజేపీ జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయాన్ని దత్తాత్రేయ శరత్ కుటుంబ సభ్యులకు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు వచ్చారు.