హైదరాబాద్

ఉద్యోగాల సాధనతోనే జిల్లా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 11: వికారాబాద్ జిల్లా వెనుకబడి ఉందని, జిల్లా అభివృద్ధి చెందాలంటే యువత మంచిగా చదివి ఉద్యోగాలు సాధించాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీ.సునితా మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సనగారి కొండల్ రెడ్డి నాలుగు నెలలపాటు ఉచిత భోజనంతో నిర్వహించిన గ్రూప్-2 ఉచిత కోచింగ్ ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీత హాజరైన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పని చేసి సంపాదించడం నేర్చుకోవాలని సూచించారు. ఉచితంగా కోచింగ్, భోజన వసతి కల్పించిన గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కొండల్ రెడ్డి అభినందనీయుడని చెప్పారు. వ్యవసాయ రంగంలోనూ వెనుకబడిన వికారాబాద్ అభివృద్ధికి శాసనసభ్యుడు సంజీవరావు నిధులు అడుగుతూనే ఉంటారని తెలిపారు. పేద, ఆర్థిక పరిస్థితిలో వెనుకబడి ఉన్నా మంచిగా చదివి ఉద్యోగం సాధించాలని పేర్కొన్నారు. ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చేయాలని, జీతాలు పెరుగుతుంటాయని తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అన్నారు. సినిమాలు, వాట్సాప్, ఫేజ్‌బుక్‌లతో సమయాన్ని వృథా చేసి, భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదని, పరిశుభ్రతను పాటించాలని, ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని తెలిపారు.
కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ జిల్లాలోని 500 మంది నిరుపేద విద్యార్థులకు నాలుగు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమని కితాబిచ్చారు. కోచింగ్ పొందిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతామని వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎస్.కొండల్ రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళాలతో పాటు, రైతుల కోసం మహారాష్ట్ర నుంచి శాస్తవ్రేత్తలను రప్పించి భూసార పరీక్షలు చేయిస్తామని ప్రకటించారు. పేద మహిళ రుక్కమ్మకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం, ఏడాదికి సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో వికారాబాద్, చేవెళ్ల శాసనసభ్యులు బీ.సంజీవ రావు, కే.యాదయ్య, శాసనమండలి సభ్యుడు పీ.నరేందర్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు అయాచితం శ్రీ్ధర్, జడ్పీటీసీ ముత్తార్ షరీఫ్, మేధావుల ఫోరం నాయకుడు దేవదాసు, ధారూర్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి హరిశంకర్, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, వికారాబాద్, మర్పల్లి మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు వెంకటయ్య, సురేష్, ఎంపీడీవో ఎం.సత్తయ్య పాల్గొన్నారు. కొండల్ రెడ్డిని విద్యార్థులు సన్మానించారు.