హైదరాబాద్

ప్రజల్లో నమ్మకం పెరిగేలా సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడి ఉంటారని, వారిలో ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచేలా సేవలందించాలని కలెక్టర్ యోగితారాణా వైద్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ రోగులకు అందుతోన్న సేవలను వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాలను సందర్శించిన తర్వాత కలెక్టర్ ఆసుపత్రిలో సేవలను మెరుగుపరిచేందుకు తీసుకోవల్సిన నిర్ణయాలపై సూపరింటెండెంట్ డా.శ్రావణ్‌కుమార్, ఆర్‌ఎంఓలతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అధునాతన సదుపాయాలను గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం కల్పిస్తోందని, ప్రజలకు ఉచితంగా అన్నిరకాల వైద్య పరీక్షలను, సేవలను, మందులను అందించేందుకు నిధులను వెచ్చిస్తోందని వివరించారు. ప్రభుత్వం కూడా గాంధీ ఆసుపత్రి పనితీరును గమనిస్తుందని వెల్లడించారు. రోగులకు ఆశించిన స్థాయిలో మెరుగైన సేవలు అందటం లేదన్న విమర్శలున్నాయని, వీటిని రూపుమాపేలా వైద్యులు సేవలందించాలని సూచించారు. రాబోయే మూడు నెలల్లో ఆసుపత్రి పనితీరు, అందిస్తున్న సేవల్లో మార్పు స్పష్టంగా కన్పించాలని సూచించారు. ముఖ్యంగా శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, అవినీతి నిరోధకం, సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, ఉచిత మందుల పంపిణీ సక్రమంగా జరగాలని అన్నారు. అంతర్గత విభేధాలు ఆసుపత్రి పనితీరుపై ప్రభావం చూపరాదని సూచించారు. రోగులకు మెరుగైన సేవలను అదంచటంమే లక్ష్యంగా ఆసుపత్రిలోని వైద్యులు, ఇతర సిబ్బంది చక్కటి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరపున అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. వివిధ విభాగాల ద్వారా ఎదురయ్యే సమస్యలను మెయిల్ ద్వారా తనకు పంపాలని సూచించారు. ప్రజస్వాయ్యయుతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని హితవు పలికారు. ప్రతి విభాగాధిపతి అంతర్గతంగా సమీక్షలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని నాలుగో తరగతి సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. రోగులు, వారి సహాయకుల సౌకర్యార్దం ప్రతి భవనం వద్ద సూచికబోర్డులను, సిటిజన్ చార్టులను, వార్డుల వివరాలను కన్పించేలా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రిలో చిన్నచిన్న మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్వాహణను క్రమబద్దీకరించేందుకు డీఈ చలపతిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. సందర్శనలో కలెక్టర్‌తో పాటు ఎంఆర్‌ఓలు డా.వీ.శేషాద్రి, డా.జయకర్ ఉన్నారు.

నిరుద్యోగులకు బాసటగా బీఎల్‌ఆర్
ఉప్పల్, జూలై 11: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్ ఉప్పల్ నియోజకర్గం ఇన్‌చార్జి బండారు లక్ష్మారెడ్డి ముందుకు వచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్సై, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, కానిస్టేబుల్, గ్రూపు-4 ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న నియోజకవర్గంలోని నిరుద్యోగులైన యువతీ యువకులకు బండారు లక్ష్మారె డ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్, శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
బుధవారం కోచింగ్, శిక్షణకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను పార్టీ శ్రేణులతో ఆవిష్కరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 12, 13, 14వ తేదీల్లో రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, హబ్సిగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరు కావాలని అన్నారు.
ఈనెల 16వ తేదీ నుంచి హెచ్‌బీ కాలనీ మీర్‌పేట కైలాసగిరిలోని మల్లికార్జున కల్యాణ మండపంలో ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుభవం ఉన్న కోచ్ లెక్చరర్లతో ఉచిత కోచింగ్, శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వివరాలకు సెల్ నెంబర్లు 9704456123, 91427999999, 8106320766, 9701414268కు సంప్రదించాలని తెలిపారు.