హైదరాబాద్

తెలంగాణ కళలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: కనుమరుగు అవుతున్న తెలంగాణ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢీల్లీ అధికార ప్రతినిధి డా.ఎస్.వేణుగోపాల చారి అన్నారు. ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘జానపద నృత్య విభావరి’ కార్యక్రమం ఆదివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేణుగోపాల చారి కళాకారులను అభినందించారు. చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సభకు ముందు నాట్య గురువు అంగర మాధవి శిష్య బృందం ప్రదర్శించిన జానపద నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. అనీల, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రాయసం వెంకట్రామయ్య, పద్మజా విశ్వాస్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు పాలపర్తి సంధ్యారాణి, రఘుశ్రీ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న వీరబ్రహ్మం పద్య నాటకం
కాచిగూడ, జూలై 15: కల్పన కళానికేతన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో పోతూలూరి వీరబ్రహ్మం పద్య నాటక ప్రదర్శన ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి డా.కేవీ కృష్ణ కుమారి, ఆచార్య టీ.గౌరి శంకర్, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, ఏభూషి యాదగిరి, చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు డా.చిక్కాదేవదాసు, మెట్రో టీవీ ప్రొడ్యూసర్ చరణ్, సంస్థ అధ్యక్షుడు జంగయ్య గౌడ్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. సభకు ముందు కళాకారులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి ప్రదర్శించిన పోతులూరి వీరబ్రహ్మం పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.