హైదరాబాద్

సంపూర్ణ ఆరోగ్యమే సర్కార్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించటంమే సర్కారు ప్రధాన లక్ష్యమని కలెక్టర్ యోగితారాణా అన్నారు. పట్టణ ప్రాథమిక కేంద్రాల్లో గర్బిణులకు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ‘ఇంద్రధనస్సు’ కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం అఫ్జల్‌సాగర్‌లో ప్రారంభించారు. కలెక్టర్ రాణా మాట్లాడుతూ ఎక్స్‌టెండెడ్ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం కింద రాష్ట్రంలోని కొమరం భీరం, ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాది, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నూటికి నూరు శాతం ఇమ్యూనైజేషన్ జరిగేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించినట్లు కలెక్టర్ వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో, కమ్యూనిటీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్యక్రమ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. నిర్దేశిత శిబిరాలకు గుర్తించిన గర్భిణులు, పిల్లలను మొబిలైజేషన్ చేసే బాధ్యతను ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలకు అప్పగించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డా.సుధీరా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.నాగార్జున రావు, సర్వైలెన్స్ మెడికల్ ఆఫీసర్ డా.ప్రగత్ కుమార్, స్థానిక వైద్యాధికారి డీ.సీమా తబస్సమ్ పాల్గొన్నారు.