హైదరాబాద్

కొలిచేవారి కొంగు బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(బిమ్మిటి శ్రీ్ధర్ )
హైదరాబాద్: బల్కంపేట అంటేనే గుర్తుకొచ్చే దైవం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి.. భాగ్యనగరంలోని అత్యధిక అమ్మవారి దేవాలయాల్లో కేవలం ఆషాఢ మాసంలో బోనాల జాతర జరిగితే, ఏడాది పొడువున బోనాల జాతర, ఆధ్యాత్మిక వాతావరణం, భక్తుల కొలాహాలం కన్పించే దేవాలయాల్లో ప్రధానమైంది బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. ప్రతి ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఇక్కడి అమ్మవారికి కల్యాణం నిర్వహించటం ఆనవాయితీ. మూడు రోజుల పాటు నేత్ర పర్వంగా జరిగే ఈ కల్యాణోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్నట్టేనని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ వెలిసిన తల్లి సృష్టిలోని అన్ని ఎల్ల జీవులకు అమ్మగా, ఎల్లమ్మగా పిలుస్తుంటారు. ఆమె మహిమలు నేటికీ కోకొల్లలు. కథలుగా భక్తుల నోట్లో నానుతూనే ఉంటాయి. ఇక్కడి అమ్మవారి గురించి ఆన్‌లైన్‌లో అనూహ్యంగా దేవాలయ వివరాలను గమనించిన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతూ అంబానీ ఆ మరుసటి రోజే బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవటం అమ్మవారి మహిమలకు ఓ నిదర్శనం. ఎక్కడెక్కడి భక్తులకు కలలో దర్శనమిచ్చి, తన సాక్షాత్కారాన్నిచ్చే, అడగక ముందే వరాలిచ్చే తల్లి బల్కంపేట ఎల్లమ్మ అని భక్తులు చెబుతుంటారు. నేటికీ వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రతి ఆది, మంగళవారాల్లో ఉదయానే్న తల స్నానం చేసుకుని అమ్మవారిని దర్శించనిదే పచ్చి మంచినీరు ముట్టుకోరు.
చారిత్రక నేపథ్యం
భాగ్యనగరం పుట్టకముందే సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం అమీర్‌పేటకు సమీపంలో ఉన్న బల్కంపేట అనేది ఓ కుగ్రామం. అప్పట్లో ఓ రైతు తన పొలంలో బావి తవ్వుతుండగా, బండరాయి అడ్డొచ్చింది. ఆ రాయిని పరీక్షించి చూడగా, బంగారం రంగులో దగదగ మెరుస్తున్న అమ్మవారి ఆకృతి దర్శనమిచ్చింది. దీంతో నాడు ఆ రైతు చేతులెత్తి మొక్కాడు. ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చేందుకు ఎంత ప్రయత్నించి, అమ్మవారి విగ్రహం అంగుళం కూడా కదలలేదు. రైతు ఊళ్లోకి వెళ్లి, జనాన్ని తీసుకువచ్చారు. అందరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తెచ్చేందుకు ఎంత ప్రయత్నించినా, ఫలించలేదు. శైవ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కలిగి, పరమ శివుడ్ని ఆరాధించే శివసత్తులను పిలిపించారు. అమ్మవారు ఇక్కడే పూజలందుకోవాలని భావిస్తున్నట్లు, ఇది దైవ నిర్ణయని చెప్పి, అమ్మవారిని రేణుకా ఎల్లమ్మ తల్లిగా గుర్తించారు. దీంతో భక్త జనం ఒడ్డున నిల్చుండే పూజలు చేసేవారు. క్రమంగా అక్కడ చిన్న ఆలయం వెలిసింది. అమ్మవారి మహిమలు క్రమంగా చుట్టూ పక్కన ప్రాంతాలకు విస్తరించాయి. రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయంలో ఈ ప్రాంతాన్ని బెహలూక్ ఖాన్, ఈ ప్రాంతానికి సుబేదారుగా వ్యవహారించి ఉంటాడన్న కథనాలు ఉన్నాయి. ఆ పేరు కాలక్రమంగా బల్కంపేటగా మారింది. హేమలాంబ, అనే సంస్కృత నామమే క్రమంగా ఎల్లమ్మగా ప్రసిద్దిగాంచింది. గ్రామీణుల వ్యవహారంలో ఎల్లమ్మగా స్థిరపడిందని పండితులు విశే్లషిస్తారు. రేణుకా అన్న మాటకు ‘పుట్ట’ అని అర్థమని పండితులు చెబుతుంటారు. దేవాలయం దక్షిణ భాగంలో తూర్పు ముఖంగా విఘ్నేశ్వరుడు భక్తులను నిర్విగ్నమస్తు అని ఆశీర్వదిస్తుంటాడు. పోచమ్మ తల్లి ఇక్కడ పూజలు అందుకుంటుంది. నవ వధువులు పెళ్లి దస్తుల్లో అమ్మవారిని దర్శించుకుంటారు.
ఎంతో మహిమోన్నతమైన జలధార
స్వయంభూ వెలిసిన రేణుకా ఎల్లమ్మ శిరస్సు భాగం నుంచి నిత్యం ప్రవహించే జల ధారకు ఎంతో మహిమ ఉంది. ఈ జలాన్ని భక్తులు మహాతీర్థంగా స్వీకరిస్తుంటారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే, ఇంట్లో తిష్టవేసిన దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతుంటారు. మన స్నానం చేసుకునే నీటిలో కొంత ఆ జలధారను కలుపుకుంటే చర్మవ్యాధులు కూడా నయమవుతాయని భక్తులు చెబుతుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల్లో ఈ నీటి గురించి తెలిసిన వారు అక్కడున్న పండితులను అడిగి నీటిని స్వీకరిస్తుంటారు. రేణుకా ఎల్లమ్మ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తుంటారు.
పూజలు..సేవలు
ఆలయంలో ప్రతిరోజు తెల్లవారుఝాము అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఆది, మంగళ, గురువారాలు ఎల్లమ్మ తల్లికి అత్యంత ప్రీతిప్రాతమైనవిగా చెబుతుంటారు. ప్రతి రోజు సాయంత్రం కుంభహారతి, పంచ హారతిలు నిర్వహిస్తారు. వారంలో ఆ మూడు రోజుల పాటు ఇక్కడ బోనాల సందడి కన్పిస్తోంది. భక్తులు మేకపోతులను అమ్మవారి బోనం ముందు, దేవాలయం ముందు బలిచ్చి, తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పండుగ చేసుకుంటారు. మూడు రోజులు పాటు వేల సంఖ్యలో భక్తులు కన్పిస్తారు. కొన్ని సందర్భాల్లో సత్రాలు దొరకటం కూడా కష్టతరమే. ప్రతి శుక్రవారం దేవాలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న, భోజనాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తుంటారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం హంపి పీఠాధిపతి విరూపాక్షనంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతను ప్రతిష్టించారు. ఇక్కడ నిత్యం నాగ దోష, కాల సర్ప దోష పూజలు జరుగుతుంటాయి. తాజాగా కొంతకాలం క్రితం ఇక్కడ 18 అడుగుల ఎత్తు శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం ఏర్పాటుతో ఆలయ శోభ మరింత రెట్టింపయింది.
రవాణా మార్గాలు
బల్కంపేటలోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయానికి వెళ్లాలంటే నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి సంజీవరెడ్డినగర్ వరకు ఆర్టీసి బస్సులు ఉన్నాయి. తాజాగా మియాపూర్, నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు మెట్రోరైలు కూడా అందుబాటులో ఉంది. సంజీవరెడ్డినగర్, అమీర్‌పేట నుంచి నామమాత్రపు ఛార్జీలకు ఆటోలు భక్తులను తరలిస్తుంటాయి. ఎంఎంటీఎస్ రైలులో నేచర్ క్యూర్ ఆసుపత్రి వరకు ప్రయాణించి, అక్కడి నుంచి కాలి నడకన ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు వెళ్లని భక్తులు ఏ టెన్షన్ లేకుండా ఆలయం ముందు వరకు వెళ్లాలంటే ఉబేర్, ఓలా వంటి క్యాబ్ యాప్‌లో బల్కంపేట రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అని డ్రాప్ లోకేషన్‌లో టైప్ చేస్తే చాలు అక్కడకు చేరుకుంటారు.
ఆషాఢ మాసం.. మొదటి మంగళవారం
ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారికి అమ్మవారి కల్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. దేవాలయం ఆరుబయట సాంప్రదాయబద్దంగా, ఎంతో ఆకర్షనీయంగా ఏర్పాటు చేసే ప్రత్యేక వేదికపై నిర్వహించే ఈ కల్యాణోత్సవాన్ని మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా,వైభవంగా జరుపుతారు. కల్యాణోత్సవాన్ని చూడటానికి మల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని చెబుతుంటారు. ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు లక్షల మంది హాజరవుతారు. వాయిద్యకారులు మై మరిచి వాయించే డప్పు వాయిద్యాలకు ఎక్కడెక్కడి నుంచి తరలివచ్చే శివసత్తుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జయ జయ ధ్వనాల నడుమ అమ్మవారు వీధుల్లో ఊరేగుతున్న సమయంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు బయల్దేరినట్టు అమ్మవారు దర్శనమిస్తుంటారు. రోడ్డుపైనే వాంటావార్పు, అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులు అమ్మవారిని కొలుస్తుంటారు.
ఉదయం 11గంటలకు కల్యాణం
మంగళవారం ఉదయం 11 గంటలకు దేవాలయం ఆవరణలోని ప్రత్యేక వేదికలో అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. కల్యాణోత్సవం ప్రశాతంగా జరిగేందుకు వీలుగా ముందుగా జాగ్రత్త చర్యగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 25 ప్రాంతాల నుంచి 125 ప్రత్యేక బస్సులను బల్కంపేటకు నడుపనున్నట్లు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ శేషుకుమారి, దేవాదాయ శాఖ అధికారి ఎంవీ శర్మ, డీసీపీ విశ్వప్రసాద్ ఉన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారికి అమ్మవారి కల్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించటం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. సోమవారం కల్యాణ ఏర్పాట్లను రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఇతర అధికారులతో కలిసి నేరుగా పరిశీలించారు.
కట్టుదిట్టమైన భద్రత
లక్షలాది మంది భక్తులు హజరు అవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా భద్రతను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రెండు కిలో మీటర్ల మేర భద్రతను ఏర్పాటు చేశారు. దేవాలయం నాలుగు దిక్కులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
భారీ గేట్ల ఏర్పాటు: బోనాలు వేడుకలకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఆలయ సింబ్బంది భారీ గేట్లను ఏర్పాటు చేశారు. అమీర్‌పేట్ నుంచి వచ్చే భక్తులు బల్కంపేట్ ఎస్‌బీఐ వద్ద నుంచి ఏర్పాటు చేసిన గేట్ల గుండా ఆలయం వద్దకు వెళ్లేలా ఏర్పాటు చేశారు.

అభివృద్ధిని ఓర్వలేకనే ఆరోపణలు
* మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, జూలై 16: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముప్పై ఏళ్లలో లేని అభివృద్ధి కార్యక్రమాలు కేవలం నాలుగేళ్లలో చేసామని, అందుకే ప్రతిపక్షాలు ఓర్వలేక అసత్య అరోపణలు చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సహకారంతో ఉమ్మడి జిల్లలో రోడ్లు, భవణాల శాఖతో పాటు పంచాయితి రాజ్ శాఖ ద్వారా అధిక నిధులు మంజూరీ చేసి రోడ్ల నిర్మణాలు పెద్ద సంఖ్యలో చేపట్టామని తెలిపారు. రూ.400 కోట్ల నిధులతో 1450 చేరువులు మరమ్మతులు చేపట్టామని వివరించారు. జిల్లలో రైతు బంధు పథకం ద్వారా సుమారు ఐదు లక్షల మంది రైతులకు 553 కోట్లు చెల్లిస్తున్నటు వివరించారు. నవంబర్ నెలాఖరు లోగా రైతు బంధు పథకం సంపూర్ణ అమలును పూర్తి చేస్తమని, దేశంలోనే రైతుకు ఎకరానికి నాలుగు వేల రుపాయుల చొప్పున చెల్లించడం మొదటిదని హర్షం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాండూర్, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలో పనులు పుర్తి అయ్యాయని ప్రస్తుతం పైప్‌లైన్లలో నీటి సరఫరా తనిఖీలు చేస్తున్నారని గ్రామ గ్రామాల్లో చిన్న చిన్న ట్యాంకుల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లాలో భారీ సంఖ్యలో పరిశ్రమలు సుమారు 24 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మహేశ్వరం, ఇబ్రహిం పట్నం ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశ్రమలల్లో యువతకు ఉపాది దొరికిందని ఇంకా సందనవేల్లి, సీతారాంపురం గ్రామాల పరిధిలో మరి కొన్ని ప్రాజెక్టులు వచ్చే ఆవకాశం ఉందని పేర్కొన్నారు.