హైదరాబాద్

జూనియర్ చాంప్స్ కార్తీకవర్ష, సాయిచరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ క్యారమ్ ఫౌండేషన్ సౌజన్యంతో టీ.విజయ్‌కృష్ణ స్మారక స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్‌లో జూనియర్స్ బాలబాలికల టైటిళ్లను సీహెచ్ సాయిచరణ్, సీ.కార్తీకవర్ష విజేతలుగా నిలిచారు. హైదరాబాద్ జిల్లా క్యారమ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టోర్నమెంట్ ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ సంక్షేమ సంఘం కమ్యునిటీ హాలులో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో మంగళవారం జరిగిన జూనియర్ బాలుర విభాగం సింగిల్స్ ఫైనల్లో సీహెచ్ సాయి చర్‌ం 25-10, 25-14 స్కోరుతో ప్రత్యర్థి సయ్యద్ ఆసీఫ్ ఆలీపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు జరిగిన సెమీ ఫైనల్లో సాయిచరణ్ 24-4, 22-18 పాయింట్లతో ప్రత్యర్థి సందీప్‌పై, సయ్యద్ ఆసీఫ్ ఆలీ 25-4, 25-6 పాయింట్లతో సూర్యపై గెలుపొందాడు. జూనియర్ బాలికల విభాగం జరిగిన సింగిల్స్‌లో ఫైనల్లో సీ.కార్తీకవర్ష 25-0, 25-8 పాయింట్లతో ప్రత్యర్థి ఎన్.స్వాతిపై విజయం సాధించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. అంతకు ముందు జరిగిన సెమీస్‌లో కార్తీక్ వర్షా 25-0, 25-0 పాయింట్లతో చరిష్మ గౌడ్‌పై, ఎన్.స్వాతి 25-1, 25-4 పాయింట్లతో కే.నందినిపై గెలుపొందింది.
* మహిళాల సింగిల్స్ ఫైనల్లో అపూర్వ, కార్తీకవర్ష
ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ క్లబ్ కమ్యునిటీ హాలులో జరుగుతున్న తెంలగాణ రాష్ట్ర ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ మహిళాల సింగిల్స్ ఫైనల్‌కు ఎల్‌ఐసీకి చెందిన ఎస్.అపూర్వ, నాసార్ స్కూల్‌కు చెందిన ఎనిమిదవ తరగతి చదువుతున్న సీ.కార్తీక వర్ష చేరుకున్నారు. సెమీస్‌లో ఆపూర్వ 25-0, 25-0 స్కోరుతో డీఎల్‌ఆర్‌ఎల్‌కు చెందిన బీ.సునీతపై, సీ.కార్తీక వర్ష 25-12, 25-0 స్కోరుతో పీ.నిర్మళపై గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెంలగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి విచ్చేసి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ క్యారమ్ సంఘం అధ్యక్షుడు బీకే హరనాథ్, హైదరాబాద్ జిల్లా క్యారమ్ సంఘం నిర్వాహణ కార్యదర్శి ఎస్.శోభన్ రాజ్ పాల్గొన్నారు.