హైదరాబాద్

రానున్నది కాంగ్రెస్ పాలనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వాహణ కార్యదర్శి పర్వతాల రాజేందర్ అన్నారు. పాతబస్తీ జంగమ్మెట్ అంబేద్కర్ నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను అయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. స్థానికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల సామన్య ప్రజలు అనేక ఒత్తిళ్లకు లోనయ్యరన్నారు. నోట్ల మార్పిడి, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు వంటి సమస్యలతో ప్రజలు విసుగు చెందారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు కేం ద్రంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అనే అయుధంతో అధికార పార్టీలకు తగిన బుద్ది చేప్పాలని రాజేందర్ ప్రజలను కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో వైభోపేతంగా జరుగనున్న బోనాలు జాతర వేడుకలను పాతబస్తీలో విజయవంతంగా జరుపుకోవాలని అన్నారు. బంగారు మైస మ్మ ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనుల కోసం జీహెచ్‌ఎంసీ స్పెషల్ బడ్జెట్ నుంచి రూ3.40 లక్షలు మంజూరు చేయించిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బస్తీ సభ్యులు విజయ్ కుమార్, శంకర్, రాజేందర్, జగన్ పాల్గొన్నారు.
తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి
కాచిగూడ, జూలై 17: తెలుగు సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. నృత్యకారిణి చిలూక త్రిష కూచిపూడి అరంగేట్ర ప్రదర్శన ఎస్‌జీఎస్ మ్యూజిక్ డ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి త్రిష చిన్నతనం నుంచే కూచిపూడి నృత్య రంగంలో రాణించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. నృత్య గురువు వాణి రమణ వద్ద కూచిపూడి నేర్చుకుని అరంగేట్ర ప్రదర్శన ఇవ్వడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో ఆచార్య డా.్భగవతుల సేతురామ్, తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నృత్య గురువు రమదేవి, ప్రసన రాణి, నృత్య గురువు వాణి రమణ పాల్గొన్నారు.
త్రినాథ రావుకు పురస్కారం ప్రదానం
కాచిగూడ, జూలై 17: ప్రముఖ గాయకుడు త్రినాథ రావుకు సినారె పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం లలిత కల్చరల్ అసోసియోషన్ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి లయన్ రాజేంద్ర ప్రసాద్, గాయకుడు త్రినాథ రావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షురాలు లలిత గన్నవరపు లలిత పాల్గొని గాయకుడు త్రినాథ రావుకు సినారె పురస్కారాన్ని ప్రదానం చేశారు. గాయకులు బాబురావు, లక్ష్మీ పద్మజ, లలితారావు, సుజాతా రమణ, వసంత లక్ష్మీ, స్వర్ణలత, జ్యోతి, వేణుగోపాల్, శివరామ కృష్ణ, టీవీ రావు, గంటి రామకృష్ణ, శ్రీనివాస్, మాధవ్ అలపించిన సినీ గీతాలు అందరిని అరించాయి.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూలై 17: సినారె 88వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయనీ సుజారమణ బృందంచే ‘నన్ను దోచుకుందువటే వనె్నల దొరసాని..’ పేరిట సినీ సంగీత విభావరి వంశీ ఆర్ట్స్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి డా.కొత్త కృష్ణవేణి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి పాల్గొని గాయనీ సుజారమణను సత్కరించి అభినందించారు.