హైదరాబాద్

పెరగనున్న నైట్‌షెల్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు కారణాలతో ఇళ్లను వదిలి నగరానికి వచ్చిన నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ తనవంతు కృషి చేస్తోంది. ప్రతిరోజు వివిధ జిల్లాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వస్తున్నట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ, వారి సంఖ్యకు తగిన విధంగా నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. త్వరలోనే మరో మూడు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. గ్రేటర్‌లో 1516 మంది నిరాశ్రయులున్నట్లు జీహెచ్‌ఎంసీ సర్వేలో తేలింది. వీరిలో 1128 మంది పురుషులు, 328 మంది మహిళలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 12 నైట్ షెల్టర్లలో 530 మంది తల దాచుకుంటున్నారు. ప్రధానంగా ఏడు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు, ప్రధాన మార్గాల్లో ఉన్న నైట్ షెల్టర్లు చలి, వాన నుంచి రక్షిస్తూ వారికి బస కల్పిస్తున్నారు. ప్రస్తుతమున్న 12 నైట్ షెల్టర్లలో 8 షెల్టర్లు పురుషులకు ఉండగా, నాలుగు మహిళల కోసం ప్రత్యేకంగా కేటయించారు. ఉప్పల్ పాత సర్కిల్‌లోని పాత మున్సిపల్ ఆఫీసు, ఎల్‌బీనగర్ సర్కిల్‌లోని సరూర్‌నగర్ పాత చావడి భవనం, అంబర్‌పేట సర్కిల్‌లో గోల్నాక క్రాంతినగర్ కమ్యూనిటీ హాల్, సికిందరాబాద్ సర్కిల్‌లోని నామలగుండులో మహిళల నైట్ షెల్టర్లు ఉన్నాయి. పురుషులకు కేటాయించిన వాటిలో చార్మినార్ సర్కిల్‌లోని పెట్లబురుజు వార్డు ఆఫీసు, గోషామహల్ సర్కిల్ శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ, యూసుఫ్‌గూడలోని వార్డు కార్యాలయం మొదటి అంతస్తు, ఖైరతాబాద్ సర్కిల్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్ కింద, గచ్చిబౌలీ సర్కిల్‌లోని శేరిలింగంపల్లి పాత మున్సిపల్ కార్యాలయం, మల్కాజ్‌గిరి సర్కిల్‌లోని ఆర్‌కే పురం బ్రిడ్జి సమీపంలో, సికిందరాబాద్ బేగంపేట ఫ్లై ఓవర్ బ్రహ్మణవాడి, మెహిదీపట్నం సర్కిల్‌లోని మాసాబ్‌ట్యాంక్ మహావీర్ ఆసుపత్రి వద్ద, గోషామహల్‌లోని కోఠి ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి, రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి వీకర్ సెక్షన్‌కాలనీ, మెహిదీపట్నం సర్కిల్‌లోని నీలోఫర్ ఆసుపత్రుల్లో పురుషుల కోసం ఏర్పాటు చేసిన నైట్ షెల్టర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వాహణ బాధ్యతలను సేవా రంగంలో పేరుగాంచిన స్వచ్ఛంద సంస్థలను గుర్తించి, వాటికి అప్పగించారు. ఈ షెల్టర్లలో ఆశ్రయం కల్పించే వారి ఆధార్, ఓటర్ గుర్తింపులతో పాటు బ్యాంకు ఖాతాలను కూడా తెరిపిస్తున్నారు. ఈ నైట్ షెల్టర్లలో ఉండే వారికి ప్రైవేటు రంగంలో తగు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా జీహెచ్‌ఎంసీ కల్పిస్తోంది.
త్వరలో అందుబాటులోకి మరో మూడు
మహానగరంలో ప్రస్తుతమున్న నైట్ షెల్టర్లతో పాటు త్వరలోనే మరో మూడు అందుబాటులోకి రానున్నాయి. సుమారు రూ. 9.71కోట్ల వ్యయంతో ఏడు నైట్ షెల్టర్ల నిర్మాణం చేపట్టగా, ఇందులో మూడింటి పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెటర్నరీ ఆసుపత్రి, కింగ్‌కోఠి, మహావీర్ ఆసుపత్రి, మాసాబ్‌ట్యాంక్, నిలోఫర్ ఆసుపత్రిలోని నైట్ షెల్టర్లు ఉపయోగంలోకి వచ్చాయి. ఇవి గాక, మరో నాలుగు నైట్ షెల్టర్లు ప్రధాన ఆసుపత్రుల వద్ధ నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

‘్ఛలో దిల్లీ’కి బయల్దేరిన మాల సంక్షేమ సంఘం
*20 నుంచి ‘48 గంటల’ ప్రతిఘటన దీక్ష

హైదరాబాద్, జూలై 17: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ మాల సంక్షేమ సంఘం ‘్ఛలో దిల్లీ’ నిర్వహించేందుకు బయల్దేరింది. మంగళవారం నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఆధ్వర్యంలో సంఘం నేతల బృందం దిల్లీకి పయనమైంది. బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 2న నిర్వహించిన భారత్‌బంద్‌లో 11 మంది అమరులైనట్లు గుర్తుచేశారు. ఈనెల 20వ తేదీ నుంచి 48 గంటల పాటు ప్రతిఘటన దీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న సామాజికవర్గానికి చెందిన ప్రజల రక్షణ గాలిలో దీపంగా మారిందని అన్నారు. ఈ తీర్పుతో ఎస్సీ,ఎస్టీల రక్షణ ప్రశ్నార్దకమైనా, ఎస్సీ ఎంపీలు నోరు విప్పకపోవటం శోచనీయం అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ,ఎస్టీ ఎంపీలను ఏకతాటిపైకి వచ్చి ఇదివరకున్న అట్రాసిటీ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేసేందుకు, 41 సీఆర్‌పీసీ నుంచి ఈ చట్టాన్ని మినహాయించి, ఆర్డినెన్స్ తీసుకువచ్చి, 9వ షెడ్యూల్‌లో చేర్చే విధంగా గళం విప్పాలని దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ ఎంపీలు పార్లమెంటును స్తంభింపజేయాలని కోరనున్నట్లు రాంప్రసాద్ వెల్లడించారు. దీక్షతో పాటు పార్లమెంట్‌లోని అన్ని రాజకీయపార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లకు మాల సంక్షేమ సంఘం తరపున వినతిపత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకురాని పక్షంలో ఎస్సీ, ఎస్టీ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దిల్లీకి వెళ్లిన నేతల బృందంలో రాంప్రసాద్‌తో పాటు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీకిషన్, ఉద్యోగ విభాగం అధ్యక్షుడు సీహెచ్ అరుణ్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కుల్పగురి రాజేశ్, ఆంజనేయులు ఉన్నారు.