హైదరాబాద్

హెల్మెట్ ఉంటేనే పెట్రోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇకపై తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారు. ఈ మేరకు జైళ్లశాఖ నూతన నిబంధనను అమలు తీసుకువస్తోంది. హెల్మెట్ వాడకుండా ఎంతో మంది యువకులు ప్రమాదాల్లో మృతిచెందడం జరుగుతున్నందున సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైళ్లశాఖ డీజీ వీకే.సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఖైదీలకు పునరావాసం కల్పించే కార్యక్రమాల్లో భాగంగా జైళ్లశాఖ పెట్రోల్ పంప్‌లను అందుబాటులోకి తెచ్చింది. యువకులు నాణ్యమైన పెట్రోల్ కావాలంటే తప్పకుండా హెల్మెట్ ధరించి రావాలని సూచించారు. ఇదే విధానాన్ని రాష్టవ్య్రాప్తంగా ఉన్న సాధారణ పెట్రోల్ బంక్‌లు సైతం పాటించాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
రోడ్ల మరమ్మతులపై దృష్టి
* పునరుద్ధరణకు 79 ఐఆర్‌టీ బృందాలు *ఇక త్వరితగతిన పనులు

హైదరాబాద్, జూలై 17: మహానగరంలో తరుచూ కురుస్తోన్న వర్షాల కారణంగా గుంతలమయమైన రోడ్లకు చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్దరణ పనులపై జీహెచ్‌ఎంసీ పాలక మండలి, అధికార యంత్రాంగం మంగళవారం ఎమర్జెన్సీగా సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశానికి జేఎన్‌టీయు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లను ప్రత్యేకంగా ఆహ్వానించి, రోడ్ల మరమ్మతులకు సంబంధించి శాశ్వత పరిష్కారం గురించి చర్చించారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో మొత్తం 9వేల కిలోమీటర్ల మేరకు రోడ్లు ఉండగా, ఇందులో 320 కిలోమీటర్ల రోడ్లను హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాక, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతుల చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ నెల 1వ తేదీ నుంచి నేటి వరకు రోడ్లపై 3వేల 141 గుంతలు ఏర్పడగా, వీటిలో 771 గుంతలను పూడ్చివేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మిగిలిన గుంతలను కూడా మరో రెండురోజుల్లో పూడ్చివేయనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు ఉమొత్తం 50వేల 100 గుంతలను పూడ్చివేసినట్లు, గత సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 మార్చి 31 వరకు 19వల 310 క్యూబిక్ మీటర్ల హాట్ మిక్స్, 58.20 మెట్రిక్ టన్నుల ఎమల్షన్, 198.75 ఎంటీల షెల్మాక్‌లను రోడ్ల మరమ్మతులకు వినియోగించినట్లు తెలిపారు. రోడ్ల మరమ్మతులకు ప్రత్యేకంగా 70 ఇన్‌స్టెంట్ రిపేట్ టీంలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌లో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయటం, గుంతలను పూడ్చివేయటానికి త్రిముఖ వ్యూహాన్ని అవలంభిస్తున్నటుల్తెలిపారు. చుడీబజార్‌లోని బీటీ మిక్స్ ప్లాంట్ నుంచి బీటీ ఎమల్షన్ ఐఆర్‌టీ, ఎమర్జెన్సీ బృందాలకు అందిస్తున్నట్లు వివరించారు. వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నందున పూడ్చివేయటానికి షెల్మాక్, రోడ్ బాండ్ బీటీ మిక్స్‌లను బ్యాగ్‌ల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఇంజనీర్లు తమ ప్రంతంలో సంబంధిత ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్లను తనిఖీ చేసి, దెబ్బతిన్న వాటిని గుర్తించిన వెంటనే పునరుద్దరించాలని సమావేశం నిర్ణయించింది. ఇప్పటికే జలమండలి, మెఅటోరైలు వివిధ పనుల నిమిత్తం తవ్విన రోడ్లను వెంనటే పునర్దురించాలని సమావేశం అధికారులను ఆదేశించింది. నిరంతరం వర్షాల వల్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. హెచ్‌ఆర్‌డీసీ వేస్తున్న రోడ్ల మార్గంలో 599 గుంతలు ఏర్పడగా, ఇప్పటి వరకు ర439 గుంతలను పూడ్చివేసినట్లు వెల్లడించారు. మిగిలిన గుంతలను నేటి సాయంత్రం, రేపు ఉదయం కల్లా పూడ్చివేస్తామని వివరించారు. ఎల్ అండ్ టీ, జలమండలి, బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర విభాగాల ఇంజనీర్లతో ప్రత్యేక కన్వర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేసి, తవ్వకాలు, గుంతలు పూడ్చివేసేందుకు ప్రత్యేక కార్యచరణ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.