హైదరాబాద్

52 ఎఫ్‌ఓబీలు, ఎనిమిది స్కైవేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు, పాదచారుల భద్రత కోసం జీహెచ్‌ఎంసీ ఫుటోవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఏసీ గార్డ్స్ మెయిన్‌రోడ్డులోని మహావీర్ ఆసుపత్రి ముందు, ఇతర పలు చోట్ల నిర్మాణం కూడా కొనసాగుతుంది. వీటితో పాటు నగరంలోని మరో 52 రద్దీ ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న మరో ఎనిమిది ప్రాంతాల్లో ఆకాశమార్గాలు(స్కైవే)లను నిర్మించేందుకు ప్రభుత్వం బుధవారం రూ. 207.71 కోట్ల పరిపాలనపరమైన మంజూరీ ఇస్తూ జీవో 546ను జారీ చేసింది. నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్ పనులు మరో అడుగు ముందుకు పడినట్టయింది. తాజాగా మంజూరీ ఇచ్చిన 52 ఎఫ్‌ఓబీల్లో కొన్ని చోట్ల ఎస్కలేటర్‌తో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇదివరకే జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన ఎఫ్‌ఓబీలకు సంబంధించి ఇప్పటికే అధికారులు 30 పేరుగాంచిన సంస్థలతో ప్రీ బిడ్డింగ్ సమావేశాన్ని నిర్వహించారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎఫ్‌ఓబీల ఏర్పాటు, స్కై వేల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి పంపిన వివరాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ మంజూరు ఇచ్చింది. ఎస్‌ఆర్‌డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లోనే, ఈ ఎఫ్‌ఓబీల ఏర్పాటు, స్కై వేల నిర్మాణాలు చేపట్టే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పరిపాలనపరమైన అంశాలపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, అదనపు కమిషనర్లు, ఇంజనీర్లతో బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.