హైదరాబాద్

సిద్ధమవుతోన్న కొత్త రిజర్వాయర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కోర్ సిటీ మాదిరిగా శివార్లకు కూడా తాగునీటిని అందించేందుకు జలమండలి చేపట్టిన ఓఆర్‌ఆర్ తాగునీటి ప్రాజెక్టు పనులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ గురువారం తనిఖీ చేశారు. బీరంచెరువు గ్రామ పంచాయతీలోని భవానీనగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కిస్మత్‌పూర్, మణికొండ, కాళికనగర్, బండ్లగూడ గ్రామ పంచాయతీలోని కాళికానగర్‌లో నిర్మాణ పనులు తుది దశలో ఉన్న రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం మండలాల్లో మొత్తం 31 రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు, ఇందులో ఈ నెల చివరికల్లా తొమ్మిది రిజర్వాయర్ల పనులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఇందు కోసం పనుల్లో వేగాన్ని పెంచాలని సంబంధిత కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. పనులు తుది దశలో ఉన్న తొమ్మిది రిజర్వాయర్లకు సంబంధించి ఇన్‌లెట్, ఔట్ లెట్ పైప్‌లైన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఓఆర్‌ఆర్ తాగునీటి ప్రాజెక్టు వల్ల ఔటర్ రింగ్‌రోడ్డు లోపలుండి, జలమండలి నీటి సరఫరా లేని ప్రాంతాలకు మంచినీటి సమస్య తీరనున్నట్లు, కోర్ సిటీ మాదిరిగానే మంచినీటిని సరఫరా చేసే అవకాశమేర్పడుతుందని వివరించారు. ఈ తనిఖీల్లో జలమండలి డైరెక్టర్లు డైరెక్టర్లు ఎం.ఎల్లాస్వామి, డి.శ్రీ్ధర్‌బాబు, పి.రవి, వాసుదేవనాయుడుతో పాటు సీజీఎంలు, జీఎంలు, పనులు చేపట్టిన వివిధ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.