హైదరాబాద్

10న నేషనల్ డీవామింగ్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నేషనల్ డీవామింగ్ డేను ఆగస్టు 10న నిర్వహించనున్నట్లు, విజయవంతం చేసేందుకు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ముందుకు రావాలని ఇన్‌చార్జి జేసీ శ్రీవత్స కోటా పిలుపునిచ్చారు. నేషనల్ డీవామింగ్ డేను పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. సంవత్సరం వయస్సు నుంచి 19 సంవత్సరాల్లోపు పిల్లల్లో నులిపురుగులతో రక్తహీనత బారిన పడుతున్నారని వివరించారు. ఈ పరిస్థితిని నివారించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో డీవామింగ్ డేను విజయవంతం చేయాలని సూచించారు. వివిధ ప్రచార మాధ్యమాలను వినియోగించుకుని ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని ఆదేశించారు. నులిపురుగుల నిర్మూలనకు ఇచ్చే అల్బెండాజాల్ మాత్రలను ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్‌వాడీ, మదర్‌సాలతో పాటు జూనియన్ కాలేజీల్లో కూడా పంపిణీ చేయటమే గాక, విద్యార్థులు మాత్రలు తప్పకుండా మింగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. ఈ మాత్రలను రెండేళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి పూర్తి మాత్రను, రెండేళ్లలోపు వయస్సు గలవారికి సగం మాత్రను ఆహారం తీసుకున్న తర్వాత మింగించాలని సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.జే.వెంకట్ మాట్లాడుతూ డీవామింగ్ మాత్రలు సరిపడే మోతాదులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 10న ఈ మాత్రలు తీసుకోని పిల్లలకు ఆగస్టు 17న మోపప్ డేను తిరిగి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్, 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నూటికి నూరు శాతం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మాత్రతో ఎలాంటి అపాయం ఉండదనే విషయాన్ని గుర్తించాలని, ఈ అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ నర్సమ్మ, ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ శ్రీకళ, ప్రైవేటు కళాశాల, పాఠశాలల యాజమాన్యాలు, మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ రాములు పాల్గొన్నారు.

22న ‘నోరి’ పురస్కార ప్రదానోత్సవం

హైదరాబాద్, జూలై 20: నోరి నరసింహ శాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవిళంబి నామ సంవత్సర ఆషాఢ గురుపౌర్ణమి పురస్కార ప్రదానోత్సవం 22న ఆదివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే కార్యక్రమానికి నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ సభాధ్యక్షత వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ.దుర్గాప్రసాద రావు హాజరుకానున్నట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా రాయసం వెంట్రామయ్య, ఆత్మీయ అతిథులుగా డా.వారణాసి వెంకటేశ్వర్లు, కళా జనార్దన మూర్తి హాజరుకానున్నట్లు తెలిపారు. పురస్కార ప్రదానోత్సవంతో పాటు గ్రంథావిష్కరణ కూడా గావించనున్నట్లు తెలిపారు. గ్రంథాల పరిచయాన్ని డా.వారణాసి వెంకటేశ్వర్లు చేయనున్నట్లు తెలిపారు. పురస్కార గ్రహీతలుగా వేదవ్యాస పురస్కానానికి కళానిధి సత్యనారాయణ మూర్తి, జగద్గురు కల్యాణానంద భారతీ మంతాచార్య పురస్కారానికి రాణీ సదాశివమూర్తి, సూత పురస్కారానికి బుర్రా భాస్కర శర్మ, సుశ్రుత వైద్య పురస్కారానికి డా.ఆర్‌వీ కుమార్, కవి సామ్రాట్ నోరి నరసింహ శాస్ర్తీ సాహిత్య పురస్కారానికి వరిగొండ కాంతారావు, వావిలాల సోమయాజుల పురస్కారానికి ఎం.కృష్ణమూర్తి, డా.సర్వేపల్లి రాధకృష్ణన్ పురస్కారానికి కమలాకర భారతి, కళాసుబ్బారావు పురస్కారానికి ఆకేళ్ళ విభీషణ శర్మను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాజ్గీ నృసింహమహాగ్ని చిత్ ప్రణీత శ్రీనృసింహ సాంఖ్య దర్శనం (సంస్కృతం, తెలుగు వ్యాఖ్యనం), చండీ సప్తశతి అనే అద్భుత, అపూర్వ గ్రంథాలు ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.