హైదరాబాద్

గిరిజన సంక్షేమ పథకాల అమలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో భేష్‌గా ఉన్నాయని, అవి వారి అభ్యున్నతికి ఎంతో దోహదపడుతున్నాయని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యురాలు మాయ చింతమన్ యువనాతే ప్రశంసించారు. శక్రవారం సోమాజిగూడలోని దిల్‌ఖుష్ గెస్ట్‌హాజ్‌లో కలెక్టర్ యోగితారాణా, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌తో కలిసి సర్కారు పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. యువనాతే మాట్లాడుతూ ఎస్‌టీ విద్యార్థులకు మంజూరు చేస్తున్న ఉపకార వేతనాలు, విద్య, వసతి, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, రుణాలు, అట్రాసిటీ కేసులు మొదలైన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అత్యాచార బాధిత మహిళలకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయిన తర్వాత పరిహారం చెల్లించటానికి చర్యలు తీసుకోవాలని, విచారణ పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ యోగితా రాణా మాట్లాడుతూ ఎస్టీ విద్యార్థులకు విద్యనందించే రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్ వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రీ, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, కాస్మోటిక్ చార్జీలను కూడా వారికి ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి పథకం కింద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు, అద్దె ట్యాక్సీలు, బైక్ ట్యాక్సీల కోసం బ్యాంకుల నుంచి సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లు, సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరయ్యేందుకు శిక్షణ, ఉపాధి హామీతో కూడిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌ల ద్వారా రుణాల మంజూరు, తద్వారా వారు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు చేయూతనిస్తున్నట్లు కమిషన్ సభ్యురాలికి వివరించారు. ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మాణం, వారి అర్హత మేరకు వారికి కేటాయింపులు జరుపనున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్టీ అత్యాచార కేసులను పరిశీలించి, వెంటనే విచారణ పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వివరించారు. సమీక్షలో ఫోరం ఫర్ జస్టిస్ సంస్థ జాతీయ అధ్యక్షుడు కోడూరి నారాయణ రావు, ఐజీ షీకా గోయల్, అదనపు డీసీపీ ఎంఏ బారీ, సోషల్ వెల్ఫేర్ డీడీ హన్మంత్ నాయక్ పాల్గొన్నారు.