హైదరాబాద్

రోడ్ల మరమ్మతులపై శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో తరుచూ కురిసిన వర్షాల కారణంగా గుంతలమయమైన రోడ్లకు శాస్ర్తియంగా మరమ్మతులు చేసేందుకు వీలుగా కార్మికులకు శిక్షణనిప్పించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇప్పటికే రోడ్ల మరమ్మతుల కోసం 384 ఇన్‌స్టెంట్ రిపేర్ టీంలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తాత్కాలిక ప్రాతిపదికన వర్కర్లుగా నియమితులైన కార్మికులకు బీటీ, సీసీ రోడ్లకు ఎలా మరమ్మతులు చేయాలన్న విషయంపై అవగాహన లేకపోవటంతో వారు మరమ్మతులు చేసినా, ఫలితం దక్కటం లేదు. ఇందుకు గాను మరమ్మతులపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణను ఇప్పించాలని జీహెచ్‌ఎంసి నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి సమీపంలో బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను పూడ్చటంలో కార్మికులు కనీసం ప్రమాణాలను పాటించటం లేదన్న విషయాన్ని మేయర్ రామ్మోహన్ గుర్తించి, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లటంతో, వారికి కొంత అవగాహన కల్పించేలా శిక్షణనిప్పించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్టెంటు రిపేర్ టీంలోని కార్మికులతో పాటు వర్షాకాల అత్యవసర బృందాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, కార్మికులందరికీ తగిన శిక్షణనిప్పించాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా గుంతలు ఏర్పడిన రోడ్డుపై గుంత ఉన్న చోట ఎంత లోతు వరకు గుంత తవ్వాలి? బీటీ రోడ్డు అయితే ఎంత? సీసీ రోడ్డు అయితే ఎంత తవ్వాలి? ఆ గుంతలో తడి లేకుండా ఏం చేయాలని అంశాలపై ఈ కార్మికులకు, అత్యవసర బృందాల్లోని వర్కర్లకు శిక్షణనిస్తున్నారు. బీటీ మిక్సింగ్, ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉండాలి, ఎలా మరమ్మతులు చేయాలని అన్న అంశాలపై శిక్షణనివ్వనున్నారు. ఇటీవలి కాలంలో రోడ్లపై ఏర్పడిన గుంతలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్, వివిధ రకాల సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ రోడ్లకు సంబంధించినవే ఉండటంతో ప్రత్యేక ప్రణాళికతో గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల పై చిలుకు గుంతలను గుర్తించి, ఇందులో ఇప్పటి వరకు 90 శాతం గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చివేయాలని కమిషనర్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ పనుల పురోగతిపై ఎప్పటికపుడు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, కమిషనర్ జనార్దన్ రెడ్డి జోన్ల వారీగా జోనల్ కమిషనర్లతో సమీక్షిస్తున్నారు.
విజిలెన్స్ ఔట్‌సోర్స్ ఉద్యోగులకు
నగరంలోని ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్న జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌కు వివిధ విభాగాల నుంచి ఇటీవలే కేటాయించిన ఔట్‌సోర్సు ఉద్యోగులకు కూడా ఆక్రమణల కూల్చివేత, క్షేత్ర స్థాయిలో అడ్డుకున్నపుడు ఎలా వ్యవహారించాలి అన్న అంశంపై ఇందిరాపార్కుల్లో ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారు.