హైదరాబాద్

భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు అన్నారు. నోరి నరసింహ శాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పురస్కార ప్రదానోత్సవ సభ ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ.. నోరి నరసింహశాస్ర్తీ సాహిత్య రంగంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేశారని కొనియాడారు. భారతీయ చరిత్రతోపాటు గ్రీస్ చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగులోనే కాకుండా అనేక భాషలలో రచనలు చేశారని చెప్పారు. బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ తన తండ్రి పేరిట చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి అనేక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. బ్రహ్మశ్రీ కళానిధి సత్యనారాయణ మూర్తికి (వేద వ్యాస పురస్కారం), బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మకు (సూత పురస్కారం), డా.రావినూతల వెంకట కుమార్ ( సుశ్రుత వైద్య పురస్కారం), వరిగొండ కాంతారావుకు (నోరి నరసింహశాస్ర్తీ పురస్కారం), మహేంద్రకర్ కృష్ణమూర్తి రావుకు (వావిలాల సోమయాజుల పురస్కారం), కమలాకర భారతికి (సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం), ఆకెళ్ళ విభీషణ శర్మకు కళా సుబ్బారావు పురస్కారాలను ప్రదానం చేశారు. పరిపూర్ణ ప్రకాశనంద భారతి స్వామి రచించిన ‘నృసింహ సాంఖ్య దర్శనం, చండీ సప్తశతి’ పుస్తకాలను ఆవిష్కరించారు. నోరి నరసింహ శాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో డా.వారణాసి వెంకటేశ్వర్లు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి పాల్గొన్నారు. అవసరాల సీత బృందం అలపించిన కర్ణాటక సంగీతం అందరినీ అలరించాయి.