హైదరాబాద్

మెట్రో పనుల్లో మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయగూడ వద్ద మెట్రోరైల్ రాకపోకలు సాగించేందుకు చేపట్టిన రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్‌ఓబీ) పనులు పూర్తి అయ్యాయి. జేబీఎస్ నుంచి ఫలక్‌నూమా వెళ్లే మార్గంలో బోయగూడ వద్ద అతి కీలకమైన ప్రాంతంలో ఎల్‌అండ్‌టీ సంస్థ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసింది. బోయగూడ వద్ద మలుపు తిరిగే ప్రాంతంలో రైల్వే బ్రిడ్జి ఉండటంతో దానిపైన మెట్రో బ్రిడ్జిని నిర్మించాల్సి వచ్చింది. మెట్రో కారిడార్-2 పనుల్లో అతి ముఖ్యమైన పనిగా దీనిని అధికారులు గుర్తించారు. అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే బోయగూడ ప్రాంతంలో సాధారణ పనులు కొనసాగించడమే కష్టసాధ్యం. సవాలుగా తీసుకున్న అధికారులు రోడ్డు నుంచి 64 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించారు. కింద రైళ్ల రాకపోకలకు, రోడ్డపై నుంచి రాకపోకలు సాగించే వాహనాలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా పనులను కొనసాగించారు. గజియాబాద్‌లోని ఉక్కు పరిశ్రమలో దీనిని ప్రత్యేకంగా తయారు చేయించారు. భారీ ట్రక్‌ల ద్వారా సికింద్రాబాద్‌కు చేర్చారు. అక్కడి నుంచి క్రైన్ల సహాయంతో బోయగూడ రైల్వే బ్రిడ్జి వద్దకు చేర్చి పనులను పూర్తి ప్రారంభించారు. నిత్యం రైళ్ల రాకపోకలు సాగించే రూట్‌లో చిన్నపాటి సమస్య తలెత్తకుండా పనులు పూర్తి చేశారు. మెట్రోరైలు సజావుగా రాకపోకలు సాగించేలా విశాలంగా నిర్మించారు. ఆదివారం బోయగూడ ఆర్‌ఓబీని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సందర్శించారు. పనులు జరిగిన తీరును ఇంజనీర్ల పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రిడ్జ్‌ను పూర్తి చేసినందుకువారిని అభినందించారు. కారిడార్-2లోని కీలకమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో మిగిలిన పనులపై దృష్టి సారించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరలో కారిడార్-2ను అందుబాటులోకి తేవడంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఏర్పడుతోందని అన్నారు.