హైదరాబాద్

పంచతత్వ పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: జీహెచ్‌ఎంసీ నగరంలోని హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని సచివాలయనగర్ పార్కుల్లో పంచతత్వ పార్కు పేరిట ఓ వినూత్నమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. కేవలం రూ.లక్ష ఖర్చుతో, చాలా తక్కువ విస్తీర్ణంలో ఈ పంచతత్వ ఆక్యుపంక్చర్ ట్రాక్‌ను ఈ పార్కుల్లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. సీనియర్ సిటిజన్లకు ముఖ్యంగా కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పంచతత్వ వాకింగ్ ట్రాక్‌లో మొదట కొద్ది దూరంలో నీటితో నింపి ఉంటుంది, ఆ తర్వాత కంకరతో కూడిన ట్రాక్, సముద్రపు ఇసుకతో కొద్ది దూరం, బటానీ సైజులో ఉన్న ఇసుకగా పిలిచే దాంతో మరికొంత దూరం, చెక్కపొట్టుతో ఇంకొంత దూరం, ఆ తర్వాత బంకమట్టి, ఎర్రమట్టితో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. నీరు, కంకర, దొడ్డు ఇసుక, మెత్తగా ఉండే బంకమట్టిపై నడిస్తే అటు అక్యుపంక్చర్‌లా పనిచేయటం, ఈ పంచతత్వ పదార్థాల వల్ల సరైన రీతిలో దేహాంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగే అవకాశముంటుందని జీహెచ్‌ఎంసీ బయోడైవర్శిటీ అదనపు కమిషనర్ వి.కృష్ణ తెలిపారు. పార్కులో చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉండి, మధ్యలో యోగ ముద్రతో ఉండే గౌతమ బుద్దుడి విగ్రహాం ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసినట్లు కృష్ణ వివరించారు. తొలి దశగా ప్రయోగాత్మకంగా ఈ పార్కును ఏర్పాటు చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
ఉప్పల్, ఆగస్టు 9: పార్కింగ్ చేసిన బైకులను దొంగిలించి, వాటిపై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలపై దాడిచేసి బంగారు ఆభరణాలను దోచుకుని తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి బైక్‌లు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ వివరాలను వెల్లడించారు. జనగామ జిల్లా సీతారాంపూర్‌కు చెందిన వేముల రమేశ్ (21), సంపంగి నరేశ్ (22), ఆకుల శ్రీకాంత్ రెడ్డి(25) కీసర రాంపల్లి భవానీనగర్‌లో నివాసముంటారు. ముగ్గురు స్నేహితులు. సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో దొంగతనాలు చేయడం ప్రారంభించారు. జీడిమెట్ల, నేరేడ్‌మెట్, కీసర, మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో బైకులను దొంగిలించి వాటిపై కాలనీలలో తిరుగుతూ ఇంటి ముందు నిలబడ్డ మహిళలు, దుకాణాల్లో నిల్చున్న మహిళల మెడలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసులు వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు చేసిన నేరాలను అంగీకరించారు. ఎనిమిది బైక్‌లను, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.