హైదరాబాద్

నిరుద్యోగ యువత ఉపాధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఆగస్టు 15: నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడానికి తమవంతు కృషి చేస్తున్నట్లు బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ చెప్పారు. వైదేహినగర్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన శుభం ఫర్నిచర్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రామ్మోహన్ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు లచ్చిరెడ్డి, నారాయణ రెడ్డి యజమానులు మురళీధర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
వెలుగుట్టపై శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ
ఉప్పల్, ఆగస్టు 15: ఉప్పల్ పారిశ్రామికవాడలోని భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీవేంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులకు బుధవారం భూమి పూజ జరిగింది. దాతల సహకారంతో సుమారు 40 లక్షల వ్యయంతో నిర్మించతల పెట్టిన ఆలయాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నా ఎందుకు ఇక్కడ నిర్మిస్తున్నారని ఆలయ ధర్మకర్తలు గొరిగె పెద్ద మల్లేష్, చిన్న మల్లేష్, జన్ని రఘు, వెంకటేశ్, హన్మంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గామాత ఆలయం పక్కనే నిర్మించడంలో శ్రద్ధ చూపిస్తున్న ఆలయ ఈఓ భాగ్య లక్ష్మిపై మండిపడ్డారు. ఏళ్ల క్రితం పెట్టిన చెట్లను అనుమతి లేకుండా నరికేసి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా హడావుడిగా స్వామి వారి ఆలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో నిర్మించబోయే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అడ్డుకోవడం మంచిది కాదని ఈఓ భాగ్య లక్ష్మి తెలిపారు.