హైదరాబాద్

ప్రజా సంక్షేమానికే ‘కంటివెలుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 15: ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు పథకానికి శ్రీకారం చుట్టిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో కంటివెలుగు పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న 2.80లక్షల మందికి ఐదు విడతల్లో ఏడు దశలుగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు, పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కంటివెలుగు పథకాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించినట్లు డిప్యూడి డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందునాయక్ తెలిపారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఆర్‌డీవో ఎం.కృష్ణ, కమీషనర్ శరత్‌చంద్ర, తహశీల్దార్ రామారావు, చైర్మన్ విశ్వం, ఎంపీపీ బుజ్జినాయక్, ఎంపీడీవో రాజేశ్వరీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బాబయ్య, నేతలు ఎంఎస్ నటరాజ్, వెంకట్‌రాం రెడ్డి, యుగంధర్, ప్రవీణ్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.