హైదరాబాద్

అభివృద్ధిలో దూసుకెళ్తున్న నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: స్వపరిపాలనలో హైదరాబాద్ మహానగరం గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధిలో దూసుకెళ్తుందని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. నగరాభివృద్ధికి వివిధ ఇతర ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరముందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సుమారు రూ.40వేల కోట్ల పనులు జరుగుతున్నాయని, రూ.25వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) పనులు, రూ.8600 కోట్ల వ్యయంతో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం రూ.1300 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం, వౌలిక వసతుల కల్పన వంటి పనులు జరుగుతున్నట్లు వివరించారు. పనులు పూర్తవుతున్న కొద్దీ ఎస్‌ఆర్‌డీపీ పనుల ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీ, చింతల్‌కుంట అండర్‌పాస్‌లను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవలే కామినేని ఆసుపత్రి వద్ద కూడా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఏకంగా లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తోందని వెల్లడించారు. ఈ సంవత్సరం చివరికి సుమారు 40వేల ఇళ్లను పూర్తి చేస్తామని, వచ్చే సంవత్సరం జూన్ నెలాఖరుకు మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని మేయర్ వివరించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బీ.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సమస్య ఆధారంగా దాన్ని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గడిచిన రెండేళ్లలో జీహెచ్‌ఎంసీకి వచ్చిన అవార్డులు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి కమిషనర్ వరకు చేసిన సమష్టితోనే దక్కాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం, పౌరసేవలను సమర్థవంతంగా అందించటంలో సునామీ మోడల్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు. భాగంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను, వికలాంగులకు వీల్‌చైర్లను, నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలను, వృద్ధులకు ఆసరా గుర్తింపు కార్డులను అందజేశారు.