హైదరాబాద్

ఎమ్మెల్యే బాబుమోహన్ కుమారుడిపై అక్రమ నల్లా కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సినీ నటుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే బాబు మోహన్ తనయుడు పవన్‌కుమార్‌పై జలమండలి అధికారులు అక్రమ నల్లా కనెక్షన్ కేసును నమోదు చేశారు. జలమండలి విజిలెన్స్ అధికారులు నిర్వహించిన అకస్మిక తనిఖీల్లో ఈ వ్యవహారం బయటకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బేగంపేట ప్రాంతంలోని మొత్తం పది భవనాల్లో అక్రమ నల్లా కనెక్షన్లకు సంబంధించి యజమానులు మొత్తం రూ. 17లక్షల వరకు బకాయి పడినట్లు గుర్తించి, కనెక్షన్లు కట్ చేసినట్లు వివరించారు. బేగంపేట సమీపంలోని సినీ నటుడు, ఎమ్మెల్యే బాబు మోహన్ కుమారుడికి చెందిన నివాసముంది. ఈ భవనం నల్లా కనెక్షన్ బిల్లు బకాయిపడటంతో అధికారులు గతంలో కనెక్షన్ కట్ చేశారు. కానీ జలమండలి అధికారులకు ఎలాంటి సమాచారమివ్వకుండా, కనెక్షన్‌ను పునరుద్ధరించుకున్నట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు జరిమానా విధించటంతో పాటు ఐపీసీ సెక్షన్ 269, 430 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. తమ అనుమతి తీసుకోకుండా, కనీస సమాచారమివ్వకుండా కట్ చేసిన కనెక్షన్‌ను అక్రమంగా మళ్లీ పునరుద్దరించుకున్నందున పై సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఈ సెక్షన్ల ప్రకారం శిక్ష పడటంతో పాటు జరిమానాను కూడా వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మరికొందరు ప్రముఖులపై ఎఫ్‌ఐఆర్
ఎమ్మెల్యే బాబు మోహన్ తనయుడితో పాటు సినీ నటుడు, నిర్మాత మాదాల రవి నివాసంలో కూడా అధికారులు అక్రమ నల్లా కనెక్షన్‌ను గుర్తించారు. వీటితో పాటు మెస్సర్స్ వైఖాన్ హాస్పిటల్, మల్లికార్జునరావు, బచన్‌సింగ్, పి.చిత్ర చౌదరి, బ్రహ్మపుత్ర, గ్రీన్‌ల్యాండ్స్, విస్పర్ వ్యాలీ క్లబ్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీల్లో కూడా అక్రమ నల్లా కనెక్షన్లున్నట్లు గుర్తించామని, తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.