హైదరాబాద్

ముంపు సమస్యను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: మహానగరానికి పొంచి ఉన్న ముంపుసమస్యను పరిష్కరించుకోవాలని, ఇందుకు ఇంజనీర్లు, నిపుణులు తగిన అధ్యయనం చేసి, మార్గాన్ని అనే్వషించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బీ. జనార్దన్ రెడ్డి ఆదేశించారు. పట్టణాల్లో వరదలు-హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయ మార్గాలు’ అంశంపై కూకట్‌పల్లి జేఎన్‌టీయులో ఒక రోజు సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఒకే సారి తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే పరిస్థితులెలా ఉంటాయో ఇటీవలే మనం ఎదుర్కొన్నామని వివరించారు.
తక్కువ సమయంలో మోతాదుకు మించిన వర్షం కురవటం వల్ల అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యియని, రెండు సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకునే సామర్ధ్యం ప్రస్తుతమున్న నాలాలకు ఉందని, వీటి సామర్థ్యాన్ని పెంచటంతో పాటు వివారు ప్రాంతాల్లో వరద నీటి డ్రెయిన్లను మరింత పటిష్టపర్చుకోవల్సిన అవసరముందని సూచించారు.
అర్బన్ ఫ్లడింగ్ వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాన్ని శాస్ర్తియ పద్దతిలో అధ్యయనం చేయాలని సీనియర్ ఇంజనీర్లను కోరారు. 400 ఏళ్ల చరిత్ర కల్గన హైదరాబాద్ నగరంలో నాలాల ఆధునీకరణ సవాలుతో కూడుకున్నదని, జీహెచ్‌ఎంసీ వద్దనున్న పరిమిత స్థాయిలో నిధులు ఉన్నా, పనులు హేతుబద్దంగా చేపట్టాల్సిన అవసరముందని సూచించారు. నగరంలో 450 కిలోమీటర్ల మేర అర్బన్ ఫ్లడ్ స్మిర్ట్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం, నివాసాలతో 2లక్షల 70వేల 350 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను, ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో 17వేల 767 హ్వారెస్టింగ్ నిర్మాణాలు, 636 వాటర్ ట్యాంక్‌లను నిర్మించాల్సిన అవసరం ముందని అధ్యయనంలో తేలినట్లు జేఎన్‌టీయు ప్రిన్సిపల్ డా.ఇ.సాయిబాబారెడ్డి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కో ఆర్డినేటర్ ప్రొ.లక్ష్మణరావు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో అర్బన్ ఫ్లడ్ స్టార్మ్ వాటర్ నెట్‌వర్క్’ అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలోని అంశాలను ఆయన సదస్సులో వివరించారు. వరద కాలువల నిర్మాణానికి రూ. 400 కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. వీటితో పాటు ఇంకుడు గుంతలు, వాటర్ ట్యాంక్‌ల నిర్మాణానికి రూ. 2వేల కోట్లు అవసరం కానున్నట్లు తెలిపారు. వేగంగా పెరుగుతున్న నగరీకరణ, పర్యావరణ అసంతులన, వాతావరణంలో మార్పులు ఈ భారీ వర్షాలకు కారణాలుగా ఆయన వివరించారు. ఈ సదస్సుకు చీఫ్ ఇంజనీర్లు జియావుద్దిన్‌తో పాటు ఇతర ఇంజనీర్లు, నిపుణులు పాల్గొన్నారు.