హైదరాబాద్

ప్రత్యామ్నాయ రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం, వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న విధానాలు దశల వారీగా అమలవుతున్నాయి. ఇప్పటికే 30కిలోమీటర్ల మేరకు మెట్రోరైలు అందుబాటులోకి రావటం, అయ్యప్ప సొసైటీ, మైండ్ స్పేస్‌ల వద్ద అండర్‌పాస్‌లు, కామినేని ఆసుపత్రి ముందు ఫ్లైఓవర్ అందుబాటులోకి రావటంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు కొంత వరకు తగ్గాయి. ఇపుడు తాజాగా ఉప్పల్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకున్న రహదారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ఈ రూట్‌లో భారీ ఫ్లైఓవర్లు, మెట్రో కారిడార్లు ఉండటంతో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక చొరవ తీసుకోనుంది. ఇందులో భాగంగానే మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హెచ్‌ఆర్‌డీసీ) ఇంజనీర్లుతో ఉప్పల్, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, ప్రత్యామ్నాయ రోడ్ల విషయాన్ని పరిశీలించారు. అంబర్‌పేట అలీ కేఫ్ నుంచి మెట్రోరైలు డిపో మీదుగా బోడుప్పల్ ఏషియన్‌న మాల్ వరకు పది కిలోమీటర్ల పొడువున, 150 అడుగుల వెడల్పుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వెంటనే అంచనాలను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించారు. అంబర్‌పేటలో ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నా, అందుకు సంబంధించి డిజైన్లు, టెండర్లను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి రోడ్డు విస్తరణ, ఆస్తుల నుంచి స్థలాల సేకరణ ప్రక్రియను ముమ్మరం చేయనున్నారు. అంబర్‌పేట అలీ కేఫ్ నుంచి ఇమ్లిబన్ వరకు మూసీ నదీ మీదుగా రోడ్డు నిర్మాణం, దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్, టీవీ టవర్ నుంచి ఇమ్లిబన్ వెళ్లే ట్రాఫిక్ సులభతరమవుతోందని అధికారులు భావిస్తున్నారు. అలీకేఫ్ నుంచి ఉప్పల్ మెట్రోరైలు డిపో మీదుగా బోడుప్పల్‌లోని ఏషియన్ మాల్ వరకు నిర్మించాలని భావిస్తున్న ఎక్స్‌ప్రెస్ వేతో ఉప్పల్ బగాయత్ నుంచి ప్రయాణం మరింత సులభతరమవుతోందని అధికారులు గుర్తించారు.