హైదరాబాద్

జ్వరాలతో గడగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: మేడ్చల్‌లోని అత్వెల్లికి జ్వరం పట్టుకోంది. కాలనీలో ఇంటికొక్కరు చొప్పున జ్వరాలతో మంచం పడుతున్నారు. అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జ్వరాలు, డెంగ్యూ, చికెన్‌గున్యాతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయ. ఎక్కడ చూసినా అపరిశుభ్రత వాతావరణం విష జ్వరాలకు కారణమని బాధితులు వాపోతున్నారు. దోమలు, ఈగలు, రోగాకర బ్యాక్టీరియాల వల్ల రోజురోజుకూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ధ్వజమెత్తుతున్నారు. పారిశుద్ధ్య లోపమే విషజ్వరాలకు కారణమని గ్రామస్థులు చెబు తున్నారు. పరిశుభ్రత విషయమై స్థానికులు పురపాలక సంఘం అధికారులకు ఫిర్యాదు చేసినా తాము ఈ విషయంలో చేసేదేమీలేదని చేతులెత్తెస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

ప్లాస్టిక్ వద్దు - జూట్ బ్యాగులే ముద్దు
శేరిలింగంపల్లి, ఆగస్టు 19: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం రమదర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన జనపనార సంచులను తారానగర్ కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాతీయ అధికార భాషాసలహా సంఘం సభ్యుడు మిరియాల రాఘవ రావు, మాజీ కౌన్సిలర్లు దుర్గం వీరేశం గౌడ్, గుర్రపు రవీందర్ రావు, కవితా గోపీ, మదర్ సేవా సమితి సభ్యుడు రమణా రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఖాజా పాషా, ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్, కమిటీ సభ్యులు ఉన్నారు.