హైదరాబాద్

తనిఖీలతో నేరాల నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు: దొంగతనాలు, నేరాలను నియంత్రించేందుకే కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి వివరించారు. ఆదివారం తెల్లవారుజాము రెండు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కొత్తూరు మండల కేంద్రంలో 160మంది పోలీసులతో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 140మంది కానిస్టేబుళ్లతో ముమ్మరంగా డోర్ టూ డోర్ తనిఖీలు చేసి నివాసం ఉంటున్న వారి ధృవపత్రాలను పరిశీలించారు. వ్యక్తులతోపాటు వివిధ రకాల వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకోవడంతోపాటు 18మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జానార్ ఆదేశాల మేరకు కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు డీసీపీ వివరించారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం ఎక్కువగా వలసలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న భయాన్ని తొలగించడంతోపాటు వారి శ్రేయస్సు కోసమే తాము కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు వివరించారు. ప్రతి ఇంటికి పోలీసుల టీం వెళ్లి ఇంట్లో ఉన్న వారిని నిద్ర నుంచి లేపి వారికి సంబంధించిన వివరాలను సేకరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించడంతోపాటు ఆధార్‌కార్డులు, వారు చేసే పని..ఇంట్లో ఎంతమంది ఉంటారు..వంటి విషయాలను ప్రజల నుండి సేకరించినట్లు వివరించారు. దాంతోపాటు పాత కేసుల్లో ఉన్న నేరస్తులను గురించి వారి వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. వాహనాలకు సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. అనుమానితులు, దొంగలు, దొంగ వాహనాలు లాంటివి ఉంటే ఈ సెర్చ్ ద్వారా బయటపడతాయని వివరించారు. ప్రతి ఒక్కరు ఇంటివద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే సమయంలో వారికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడంతోపాటు ఆధార్ కార్డు, పని వివరాలు తెలుసుకున్న తరువాతే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, సీఐలు అశోక్‌కుమార్, మధుసూదన్‌తోపాటు ఎస్‌ఐలు శ్రీశైలం, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.