హైదరాబాద్

ముసురుతో జనం అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి0: మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ముసురుతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసింది. ఈ ముసురుతో జనం, వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
రహదారులు కూడా జలమయమై గుంతలు ఏర్పడి వాహనదారులకు ఎక్కడ గుంత ఉందోనని బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా వెళ్లడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఎడతెరపి లేని భారీ వర్షం
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సోమవారం ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుండి సోమవారం రాత్రి వరకు ముసురుతో కూడిన వర్షం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్లు, అంతర్గత రహదారులు వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంచినీటి పైపులైన్‌ల కోసం త్రవ్వకాలు చేసిన పలు బస్తీలు, కాలనీలలో బురద మయంగా మారాయి.
తాండూరు : రెండు మూడు రోజులుగా తాండూరు పట్టణ డివిజన్‌లోని ఏడు మండలాల పరిధిలో జడివానలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి ప్రాంతంలో జడివానతో వాన ముసురు పట్టుకుంది. గత వారం వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వానలతో డివిజన్‌లోని అన్ని మండలాల రైతాంగం ఖరీఫ్ పంటలు సాగుచేస్తున్న రైతులు తమ పంటలకు తగిన వర్షం కురుస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వర్షాలు లేక ఆందోళనలు వ్యక్తం చేస్తున్న రైతులకు డివిజన్‌లో నాలుగైదు భారీ వర్షాలు కురవాల్సి ఉందన్నారు.
తాండూరు డివిజన్‌లో ఎక్కడా చూసినా చెరువులు కుంటలు కనిష్టస్థాయి నీటి మట్టాలతో వెలవెల బోతున్నాయి.
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. మోమిన్‌పేట, పూడూర్, దౌల్తాబాద్ మండలాల్లో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదవగా, మిగతా మండలాల్లో దాదాపు సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్ రెడ్డి సూచించారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నందున కుంటలు, చెరువుల కట్టలు తెగకుండా అధికారులు ఎప్పటికపుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం, ఎప్పటికపుడు పూర్తి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఫైర్ సేఫ్టీపై అవగాహనకు ప్రత్యేక బృందాలు
హైదరాబాద్, ఆగస్టు 20: తొమ్మిది వేల కిలోమీటర్ల సీసీ, బీటీ రోడ్లున్న మహానగరంలో పాదచారుల కోసం కేవలం 300 కిలోమీటర్ల మేరకు మాత్రమే ఫుట్‌పాత్‌లున్నాయి. అవీ ఆక్రమణలకు గురైనట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ‘రైట్ టు వాక్’ను అమలు చేస్తూ ఇటీవలే ఫుట్‌పాత్ ఆక్రమణలై ఉక్కుపాదం మోపి పాదచారుల భద్రతకు భరోసా ఇచ్చింది. ఇపుడు హోటళ్లు, పబ్‌లు, బార్లలోని వినియోగదారుల భద్రతపై దృష్టి సారించింది.
వ్యాపార సంస్థలైన హోటళ్లు, పబ్‌లు, బార్లు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను ఏర్పాటు చేసుకునేందుకు ఎట్టకేలకు గడువు విధించింది. ఈ నెలాఖరులోపు సేఫ్టీ ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవాలని, లేని పక్షంలో ఎలాంటి నోటీసుల్లేకుండా సీజ్ చేస్తామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. సోమవారం హోటల్, పబ్, బార్‌ల నిర్వాహకులతో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జా.బీ. జనార్దన్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి హోటల్, పబ్, బార్ యజమాని తప్పకుండా ప్రమాణాలను ఏర్పాటు చేసుకు జీహెచ్‌ఎంసీ నుంచి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ సర్ట్ఫికెట్‌ను పొందాలని సూచించారు.
ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలంటే, అందుకు ఎంత ఖర్చవుతుందోనన్న అపోహ నిర్వాహకుల్లో ఉందని, అవగాహనతో నాణ్యమైన పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రమాద నివారణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నిబంధనల ప్రకారం ప్రమాణాలను, పరికరాలను ఏర్పాటు చేసిన సంస్థలకే క్లియరెన్స్ సర్ట్ఫికెట్‌ను జారీ చేస్తామని స్పష్టం చేశారు. కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వెయ్యి మీటర్ల ఏరియా ఉన్న బార్లు, పబ్‌లు, హోటళ్లకు కేవలం రూ.30వేల నుంచి రూ.50వేల మధ్య ఫైర్ ఫైటింగ్ పరికరాలు సమకూరుతాయని వివరించారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ పబ్‌లు, బార్లు, హోటళ్ల యజమానులు దరఖాస్తులను పూర్తి చేసి ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని, ఆ తర్వాత ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గరిష్టంగా 50 మంది కూర్చునే కెపాసిటీ కల్గిన బార్, పబ్, రెస్టారెంట్లు, హోటళ్లు తప్పకుండా ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ సర్ట్ఫికెట్లు తీసుకోవాలని సూచించారు.