హైదరాబాద్

సాయంత్రం 5గంటల వరకు ‘కంటివెలుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కంటివెలుగు కార్యక్రమానికి ప్రజలను సమీకరించాలని సీఆర్‌పీలు, సంబంధిత అధికారులను కలెక్టర్ యోగితా రాణా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఆసిఫ్‌నగర్ మండలంలోని విజయనగర్‌కాలనీలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సందర్శించారు. కంటివెలుగు కింద పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రతి శిబిరం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేయాలని సూచించారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి, ఉచితంగా పరీక్షలు చేయించుకుని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోవారం ఒక్కరోజే విజయనగర్‌కాలనీ శిబిరంలో 202 మందికి వైద్య పరీక్షలు చేశారని, ఇంకా అధిక సంఖ్యలో జనాన్ని సమీకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వైద్య పరీక్షల తర్వాత అవసరమైన వారికి శస్తచ్రికిత్సల కోసం ఆశావర్కర్లు రోగులతో కలిసి స్వయంగా రెఫరెల్ ఆసుపత్రులకు వెళ్లి, వారికి వైద్యం అందేలా సహకరించాలని ఆదేశించారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ ఏర్పాట్ల గురించి, సిబ్బంది పనితీరు వంటి విషయాలను తెలుసుకున్నారు. కలెక్టర్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఏడీ హన్మంత్ నాయక్, ఆసిఫ్‌నగర్ తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు ఉన్నారు.
నిర్ణీత గడువులోపు..
నగరంలోని సర్వశిక్షా అభియాన్ ఇంజనీరింగ్ విభాగం వివిధ పాఠశాల భవనాలకు చేపట్టిన మరమ్మతు పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ యోగితారాణా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో సీబీఎఫ్ నిధులతో చేపట్టిన హాస్టల్ భవనాల జువైనల్ హోం రిపేర్లు వంటి అంశాలపై సమీక్షా నిర్వహించారు. పని పూర్తి చేయటంలో సమయపాలన, నాణ్యతను పాటించాలని సూచించారు. అంబర్‌పేట బాలికల జువైనల్ హోం, ముషీరాబాద్ బాలికల హాస్టల్, నాంపల్లి ఎస్సీ హాస్టల్, సైదాబాద్, ఖైరతాబాద్‌లలోని హాస్టళ్ల రిపేర్లు పూర్తి చేసి, విద్యార్థులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమీక్షలో సీపీఓ వీరభద్రం, ఎస్‌ఎస్‌ఏ ఈఈ భాస్కర్, టీఎస్‌ఈడబ్యుఐడీసీ డీఈ మధు, దేవదాస్ హాజరయ్యారు.
ప్రజావాణికి 16 ఫిర్యాదులు
ప్రజాసమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ యోగితా రాణా 16 ఫిర్యాదులను స్వీకరించారు. వీటన్నింటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ ఉద్యోగాలు, రుణాలు, ఇళ్లు, పెన్షన్లు తదితర అంశాలపై వినతులు, ఆర్జీలను స్వీకరించారు. చిక్కడపల్లిలోని వికలాంగుల హక్లుక జాతీయ వేదిక, హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ సభ్యులు వికలాంగులకు ప్రతి నెల ఇచ్చేరూ. రూ.1500 పెన్షన్ సరిపోవటం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.5వేలకు పెంచాలని, రూ.వంద సబ్సిడీతో 5లక్షల రుణాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించాలని వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. మెహిదీపట్నంకు చెందిన కవిత కలెక్టర్‌ను కలిసి, తాను పాలిటెక్నిక్ డిప్లొమా 2016 పాస్ అయ్యాయని, ఇంత వరకు ఎక్కడా ఉద్యోగం రాలేదని, పేద కుటుంబమైన తమ పోషణ కూడా కష్టతరమవుతోందని, తనకు ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ కవిత దరఖాస్తును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిని ఆదేశించారు. సైదాబాద్ మండలం చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు సింగరేణి కాలనీలో వాంబే గృహాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పక్కన ప్రభుత్వ స్థలంలో డ్రైనేజీ పగిలి చెత్తతో నిండి ఉందని, ఈ స్థలాన్ని పిల్లలకు ఆట స్థలంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న సాయిరాం స్కూల్ ప్రభుత్వ అనుమతి లేకుండా 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు నిర్వహిస్తుందని, ఈ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరమ్ ఫిర్యాదును కలెక్టర్‌కు అందజేసింది. డీఈఓ ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల దగ్గర 68 ఫిర్యాదులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమానికి జేసీ శ్రీవత్స కోటా, ఇన్‌చార్జి డీఆర్‌ఓ రాధికా రమణి, ఆర్డీఓ చంద్రకళ, ఏఓ నవీన్ హాజరయ్యారు.