హైదరాబాద్

ముందస్తు ఎన్నికలపై సుప్రీంకు వెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహించవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షుడు పేరం శివనాగేశ్వర రావుతెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎన్నికల నిర్వహణ పెనుభారంగా మారుతోందని, కేవలం మూడు నెలల వ్యవధితో రెండు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని అన్నారు. పూర్తి మెజారిటీతో నడుస్తున్న ప్రభుత్వాన్ని అతి కొద్దిమంది నిర్ణయం మేరకు రద్దు చేయడం సరికాదన్నారు. ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రం మిగిలిన కాలానికి గవర్నర్ పాలన విధించి పార్లమెంట్ ఎన్నికలతో కలిపి అసెంబ్లీకీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నోబుల్ సీసీ విజయం
హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఆయూష్‌మనోత్ బౌలింగ్‌లో రాణించి 10 పరుగులిచ్చి మూడు వికెట్లు, ఖలీల్, తరుణ్, నోమాన్‌లు చేరి రెండేసి వికెట్లు తీసుకోవడంతో నోబుల్ క్రికెట్ క్లబ్ 66 పరుగుల తేడాతో సన్‌షైన్ క్రికెట్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న ఏ-3 డివిజన్ వనే్డ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నోబుల్ సీసీ 33.4 ఓవర్లలో 192 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన వసంత్‌మర్గ్ 30, షేక్ ఖలీల్ 39, రాహిల్ 28 పరుగులు చేశారు. సన్‌షైన్ సీసీ బసలర్లు రోహిత్ ఎనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు, రాము 36 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నారు. సన్‌షైన్ సీసీ 30.2 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయ్యి ఓటమి పాలైంది. నోబుల్ క్రికెట్ క్లబ్ జట్టు బౌలింగ్‌లో మీడియమ్ ఫేసర్ ఆయూష్ మనోత్ 10 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోగా ఖలీల్, తరుణ్, నోమాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.