హైదరాబాద్

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: యావత్ తెలంగాణ సమాజాన్ని మోసగించిన టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేస్తానని ఆ పార్టీని వీడిన వసుంధర ప్రకటించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో పార్టీ విధానాలపై ఆమె తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా పాలన సాగించిన ఒకేఒక్క ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోతారని అన్నారు. పార్టీలో మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు, ఎన్నికల హామీలను నెరవేర్చని పార్టీని మరోమారు నమ్మి మోసపోవద్దని రాష్టవ్య్రాప్తంగా ప్రచారం చేస్తానని తెలిపారు.
టెన్నిస్ చాంప్ జాయ్, చెవిక
హైదరాబాద్, సెప్టెంబర్ 11: నగరంలో నిర్వహించిన గోల్డ్‌స్లామ్ ప్రథమ జూనియర్ టెన్నిస్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అండర్-14 బాలబాలికల టైటిళ్లను జాయ్, చెవికలు కైవసం చేసుకున్నారు. బాలుర విభాగం ఫైనల్లో జాయ్ 6-3 స్కోరుతో ప్రత్యర్థి అనిరుధ్‌పై, బాలికల్లో చెవిక 6-3తో శ్రీజశ్వితా రెడ్డిపై విజయం సాధించి టైటిళ్లను సొంతం చేసుకున్నారు. అడర్-12 విభాగంలో జరిగిన ఫైనల్లో బాలురలో ధీరజ్‌రెడ్డి 6-5తో హేమంత్‌రెడ్డిపై, బాలికల్లో వంశిక 6-1తో హర్ష్మితపై, అండర్-10 విభాగంలో బాలురలో శ్రీవంత్ రెడ్డి 6-4తో శశాంక్ సాయిప్రసాద్‌పై గెలుపొంది టైటిళ్లను గెలుచుకున్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి
కాచిగూడ, సెప్టెంబర్ 11: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శిఖరం ఆర్ట్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం గానసభలోని కళావేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, పండిట్ అంజిబాబు, సంస్థ అధ్యక్షుడు జీ.కృష్ణ పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వాస్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ సంపత్ కుమార్ శిష్య బృందంచే సంగీత విభావరి నిర్వహించారు.