హైదరాబాద్

మానవత్వం పరిమళించిన మహా వ్యక్తి రోశయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: మానవత్వం పరమళించిన గొప్ప వ్యక్తి కొణిజేటి రోశయ్య అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ డా. ఎ.చక్రపాణి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ‘టంగుటూరి ప్రకాశం పంతులు - వంశీ పురస్కారం’ రోశయ్యకు పురస్కారంతో పాటు ఆదర్శ దంపతులకు ‘కనకాభిషేకం’ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చక్రపాణి మాట్లాడుతూ.. రోశయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా అనేక పదవులలో రాణించారని కీర్తించారు. రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా కీర్తిని పొందారని తెలిపారు. టంగుటూరి ప్రకాశం పంతులు పురస్కారం రోశయ్యకు ప్రదానం చేయడం సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, ప్రజానటి జమునా రమణారావు, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, సినీ నటుడు విజయచందర్, దైవజ్ఞశర్మ, తానా మాజీ అధ్యక్షుడు డా.రాఘవేంద్ర ప్రసాద్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.
కడుపుబ్బ నవ్వించిన ‘వినోదాల విందు’
కాచిగూడ, సెప్టెంబర్ 12: ఫ్రెండ్స్ కామెడీ క్లబ్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘వినోదాల విందు’ కార్యక్రమం బుధవారం గానసభలోని కళావేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. హాస్యనటులు ఎంవీ సుబ్రహ్మణ్యం, చలపతి, జబర్ధస్త్ ప్రకాశ్, మూర్తి, సుధాకర్ ప్రదర్శించిన ‘ వంటవాడేడి, బిల్లు ఇస్తాడా’ తదితర స్కీట్స్‌ను ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రత్నాకర శర్మ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, సెప్టెంబర్ 12: రాగమాధరి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘నీవులేక వీణ పలుకలేనన్నది’ పేరిట సినీ సంగీత విభావరి బుధవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి సిండికేట్ బ్యాంకు జనరల్ మేనేజర్ విజయ్‌కుమార్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎవీ పుల్లారావు పాల్గొని గాయనీ గాయకులను అభినందించి సత్కరించారు. గాయనీ, గాయకులు శ్రీనివాసులు, శ్రీనివాస్ కర్ర, సుబ్రహ్మణ్యం, పరమేశ్వరి, అఖిల, రేవతి, పల్లవి, రామలక్ష్మీ అలపించిన సినీ గీతాలు అలరించాయి.
శివ శంకర శాస్ర్తీ సేవలు మరువలేనివి
కాచిగూడ, సెప్టెంబర్ 12: ప్రముఖ సాహితీవేత్త తల్లావర్జుల శివశంకర శాస్ర్తీ సాహిత్య రంగానికి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ సీనియర్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. శివ శంకరశాస్ర్తీ జయంతి సభ శారద మ్యూజిక్ అకాడమీ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వకుళాభరణం కృష్ణమోహన రావు శివశంకర శాస్ర్తీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తల్లావర్జుల శివ శంకర శాస్ర్తీ గొప్ప సాహితీ