హైదరాబాద్

నేడు మహా గణపతికి తొలి పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాగణపతి పూజలకు సిద్ధమయ్యాడు. ప్రతి ఏడాదిలాగే ఈసారి ప్రత్యేక తిథినందు స్వామి తొలి పూజ నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం నిర్వహించనున్న మొదటి పూజకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరు అవుతున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ కాలసర్ప మహాగణతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 57 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో ఏడు సర్పాల నీడన రూపొందించారు. ముషిక వాహనుడికి ఇరువైపులా సరస్వతి దేవీ, లక్ష్మిదేవీలను, స్వామికి కుడివైపు శ్రీనివాస కల్యాణ ఘట్టాన్ని, ఎడమవైపు నందిపై కొలువుదీరిన శివపార్వతుల ప్రతిమలను అందంగా తీర్చిదిద్దారు.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు
గౌరీ తనయుడి రూపానికి తగ్గట్టుగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం 75 అడుగుల కండువా, జంధ్యాన్ని అందించనున్నారు. సాంప్రదాయ బద్ధంగా చేనేతకారులతో పట్టువస్త్రాలను తయారు చేయించారు. ఉదయం 7గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా నుంచి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో స్వామి చెంతకు కండువా, జంధ్యం, పట్టువస్త్రాలను తీసుకువస్తారు. అనంతరం బీసీ కమిషనర్ చైర్మన్ బీఎస్ రాములు, ఐఏఎస్ అధికారి పార్ధసారథి, అడ్వకేట్ జనరల్ బండ శివనంద ప్రసాద్, డీసీపీ విశ్వప్రసాద్, బాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రామచంద్రం చేతుల మీదుగా పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
భారీ బందోస్తు
ఖైరతాబాద్ గణపతి చెంతకు తెలుగు రాష్ట్రాల నుంచేకాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డీసీపీ విశ్వజిత్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు గణనాథుడి వద్ద బందోబస్తు నిర్వహిస్తారు. వీరికి సహకరించేందుకు ఉత్సవ కమిటీ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని సైతం నియమించింది. చిన్నపాటి సంఘటన సైతం చోటుచేసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భారీ గణనాథిడి పరిసర ప్రాంతాలు మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతాయి. సుమారు 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్వామివారి చెంతనే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసి నలుదిక్కుల భక్తుల రద్దీ, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి వెలుపల విధులు నిర్వహించే పోలీసులను అప్రమత్తం అవుతుంటారు.
ఖైరతాబాద్ మహాగణపతి పూజ కార్యక్రమాలు కొనసాగే పది రోజులపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. రాజ్‌ధూత్ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలు వార్డు కార్యాలయం వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. రైల్వేగేట్ నుంచి వచ్చే వాహనాలను మార్కెట్ వైపుకు మళ్లిస్తారు. ప్రింటింగ్ ప్రెస్‌వైపు నుంచి వచ్చే వాహనాలు వెల్‌నెస్ సెంటర్ నుంచి వార్డు కార్యాలయం మీదుగా రాజ్‌ధూత్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. గణనాథుడి వెనుకవైపు నివసించేవారు ఐమ్యాక్స్, రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న రైల్వేగేట్ నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు.
వెస్ట్‌జోన్‌లో 3400 గణపతి మండపాలు
పశ్చిమ మండలం పరిధిలో ఈ సంవత్సరం సుమారు 3400 గణపతి మండపాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా 3200 ఏర్పాటు చేయగా, ఈసారి మరో 200 వరకు పెరగవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, హుమాయన్‌నగర్ పరిధిలో వీధివిధినా గణనాథులు కొలువుదీరనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకుల పూర్తి వివరాలను తీసుకొని వారితో పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. భక్తుల రద్దీతో పాటు స్థానికులు రాకపోకలు సాగించే రోడ్లపై ఏర్పాటు చేసిన మండపాల నిర్వహన పట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి సూచనలు జారీ చేశారు. విద్యుత్ షాక్‌లతో ప్రమాదాలు జరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడి ఇబ్బందులు కలిగించవద్దని, గణేష్ మండపాల వద్ద నియమించిన పోలీస్ అధికారుల సూచనలను తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.
డీజేలు నిషేదం
మండపాల వద్ద చెవులు దద్దరిల్లేలా మ్యూజిక్ ఏర్పాట్లు చేయవద్దని సూచించారు. ముఖ్యంగా డీజే సౌండ్లకు నగరంలో అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే నిర్వాహకులపై చట్టరిత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దైవ కార్యక్రమాన్ని సావదానంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న నిర్వాహులే బాధ్యత వహించాల్సి వస్తోందని తెలిపారు.