హైదరాబాద్

ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జంటనగరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శంచడానికి వచ్చే భక్తుల కోసం ఖైరతాబాద్ పరిసర ప్రాంతల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలను నగర పౌరులు పాటించాలని హైదరాబాద్ నగర పొలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. బుధవారం కమీషనర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మింట్ కాంపౌండ్ రోడ్డు, నెక్లెస్ రోటరీ మార్గాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. ఖైరతాబాద్ లైబ్రరీ, గణేష్ విగ్రహం నుంచి వాహనాలకు అనుమతిస్తారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి అనుమతించరు. ఖైరతాబాద్ లైబ్రరీ నుంచి నిరంకారీ నుంచి రాజీవ్ గాంధీ వైపు వెళ్ళవచ్చు. రాజ్‌దూత్ హోటల్ నుంచి ఖైరతాబాద్ మార్కెట్ వైపుకు అనుమతిలేదు. ఖైరతాబాద్ లైబ్రరీ వెనక నుంచి ఎంసిహెచ్ శానిటరీ వార్డు కార్యాలయం నెంబర్ 6 నుంచి ప్రింటింగ్ ప్రెస్ మీదుగా మార్కెట్ రూట్ వైపు వాహనాలకు అనుమతి ఇస్తారని కమిషనర్ సూచించారు.

గణేష్ ఉత్సవాలకు విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్‌లో 11 రోజుల పాటు జరగనున్న గణేష్ పండుగ ఉత్సవాల సందర్భంగా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి రఘుమారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సీఎండీ తన కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లుతో సమీక్షా సమావేశం నిర్వసించారు. గణేష్ నిమర్జనం సందర్భంగా 24 గంటలు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అందుకు విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంటనగరాల్లో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాలను, నిమర్జన ప్రదేశాలను పరిశీలించాలన్నారు. నిమర్జనం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించే ప్రాంతల్లో పర్యటిస్తూ విద్యుత్ తీగెలపై నున్న చేట్టుకొమ్మలు కొట్టడం, వదులుగా ఉన్న తీగెలు సిరిచేయటం,బ్రేకర్స, రోడ్డు క్రాసింగ్‌లు వంటి పనులు తనిఖీ చేయాలన్నారు. నిమర్జన సందర్భంగా అన్ని సబ్‌స్టేషన్లలో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. డివిజన్ స్థాయిలో ఉండే సిబ్బంది, సెంట్రల్ బ్రెక్ డౌన్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతల్లో పని చేసే అధికారుల మెబైల్ ఫోన్లు నెంబర్లు మండపాల నిర్వాహకులకు తెలియచేయాలన్నారు. వర్షాలు పడే సూచనలు ఉన్నందున సిబ్బందికి టెస్టర్, స్క్రూడ్రైవర్, చేతి గొడుగులు, హెల్‌మెట్స్, ఇన్సులేషన్ టేప్, రేయిన్‌కోట్ పరికరాలను సిబ్బందికి అందచేయాలన్నారు. ప్రముఖ నిమర్జన ప్రాంతల్లో 24 గంటల విద్యుత్ సరఫరా ఉండాలన్నారు.శోభాయాత్ర జరిగే ప్రాంతల్లో ఇనుప స్తంభాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలన్నారు. 10 అడుగుల విగ్రహాలు మండపాల నుంచి తీసుకువస్తున్నప్పుడు విద్యుత్ కార్మికుడు అక్కడ తప్పనిసరిగా ఉండాలన్నారు. గణేష్ మండలాలకు అధికారికంగా విద్యుత్ కనెక్సన్ తీసుకోవాలి, లోడుకు సరిపడు వైరును ఎంసిబి, నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడాలన్నారు. విద్యుత్ కనెక్సన్‌ల కోసం స్తంభాలు ఎక్కడం నేరమమని, వాటిని నిర్వహించే కార్మికులు అందుబాటులో ఉంటారని చెప్పారు. మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ సంఘటన జరిగినా తక్షణం 1912 నెంబరుకు సమాచరం అందివ్వాలని నగర ప్రజలకు సూచించారు. నిమర్జనం పూర్తయ్యే వరకు జంటనగరాల్లోని ప్రాంతల్లో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించాలన్నారు. ముఖ్యంగా హుసేన్ సాగర్ వద్ద మూడు ట్రాన్సఫార్మర్లకు అధనంగా 500 కేవీఏ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద అత్యవసర విద్యుత్ కోసం రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు.