హైదరాబాద్

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. రంగారెడ్డినగర్ బీజేపీ కార్యాలయం వద్ద రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందనం దివాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి గీతాన్ని ఆలపించారు. షాపూర్‌నగర్‌లోని ఉషోదయ టవర్స్ వద్ద బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బక్క శంకర్ రెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మువ్వనె్నల జెండాను ఎగుర వేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దివాకర్, శంకర్ రెడ్డి మాట్లాడుతూ నేడు తెలంగాణాకు విముక్తి లభించిన రోజు అని తెలిపారు. అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్టమ్రని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. బీజేపీ నాయకులు రఘుపతి, చండి శ్రీను, రాజాగౌడ్, దీపక్, కేశవ్, బలరామ్, వెంకటేశ్, రంగా శ్రీనివాస్ గౌడ్, ఆషా, రాజేశ్వరి, గోపాల్, విమల్, గోపాల్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.
సికిందరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని బిజెపి నగర ఉపాధ్యక్షులు బండేపల్లి సతీష్ పేర్కొన్నారు. సోమవారం సీతాఫల్‌మండి మెట్టుగూడలో బైక్‌ర్యాలీ నిర్వహించి పలు ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బండేపల్లి సతీష్ మాట్లాడుతూ తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజును నిర్వహించకపోవడం ప్రభుత్వ అసమర్థకు నిదర్శమని దుయ్యబట్టారు. క్లాక్‌టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కే.హరి, ప్రభుగుప్త, నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
సికిందరాబాద్ బౌద్దనగర్‌లో బీజేపీ నాయకులు రవిప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం దారణమని అన్నారు. అధికారంలోకి రాగానే అధికారికంగా నిర్వహిస్తామన్న కెసిఆర్ మాటమార్చారని ఆరోపించారు.
ఉప్పల్: జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడతో పాటు కాచవాని సింగారంలో సోమవారం తెలంగాణ విమోచన దినం వేడుకలను బీజేబీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పురపాలక సంఘాల పరిధిలోని చెంగిచర్ల, మేడిపల్లి, పర్వతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్‌లో వాడ వాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలనను నుంచి విముక్తి కోసం ఎందరో ప్రాణాలను ప్రాణంగా అడ్డుపెట్టి ఉద్యమించిన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి ఎందరో మహానుభావులతో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సర్థార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో ముందుకు వెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు ఎడవెళ్లి రఘువర్ధన్ రెడ్డి, గోనే శ్రీనివాస్, నేతలు రాణి, రజనీ రెడ్డి, లోడె చంద్రయ్య, రాజశేఖర్ రెడ్డి, స్వరూప, విష్ణుమూర్తి, పవన్ రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్, అనీల్ రెడ్డి, శ్యాంరావు, చిత్తరంజన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నిఖిల్, ఉపేందర్ గౌడ్, కోటగిరి ప్రభంజన్ గౌడ్, అశోక్, శ్రీకాంత్, ఆంజనేయులు, రత్నాకర్, ప్రవీణ్, నరేష్ పాల్గొన్నారు.
వనస్థలిపురం: ఎల్బీనగర్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన్సూరాబాద్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ పరుషురాం రోహిత్ ఆధ్వర్యంలో శ్రీసరస్వతి నగర్ కాలనీలోని వినాయక మండపం ఆవరణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకన్న, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు కడారి యాదగిరి యాదవ్, లింగాచారి, వినోద్, రవి కుమార్ గుప్తా, రఘు గౌడ్ పాల్గొన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కడారి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్‌రెడ్డి, జక్కిడి మహేందర్ రెడ్డి, పీ.రోహిత్, మహేష్ ముదిరాజు, పీ.శ్రీ్ధర్ గౌడ్ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వనస్థలిపురం డివిజన్ పరిధిలోని కాంప్లెక్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీ.గిరిధర్, విజయలక్ష్మీ,అరుణ్ జోషి,శంకర్ యాదవ్ పాల్గొన్నారు.
ఎల్బీనగర్ టీడీపీ ఆధ్వర్యంలో చంద్రపురి కాలనీలోని టీడీపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి, నాయకులు పారంద రమేష్, నాంపల్లి రామేశ్వర్, గోవింద్ వెంకట్, కృష్ణంరాజు, మురళీధర్ రెడ్డి, పల్లె గణేష్ గౌడ్ పాల్గొన్నారు.
కీసర: కీసర మండలంలోని పలుగ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. నాగారం, కీసర, దమ్మాయిగూడ, రాంపల్లి, భోగారం, గోధుమకుంట, చీర్యాల, అంకిరెడ్డిపల్లి, అహ్మద్‌గూడ గ్రామాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాను ఎగురవేసి విమోచనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి సెప్టెంబరు 17న తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేశ్, కీసర మండల పార్టీ అధ్యక్షుడు ఏ.రాజిరెడ్డి, నాగారం పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు తిరుమల్ రెడ్డి, వేణు, సత్యనారాయణ, సత్తిరెడ్డి, అశోక్, బలరాం, ఐలయ్య, కృష్ణ, శ్రీశైలం, బాపిరెడ్డి, మహేందర్, దుర్గేశ్ పాల్గొన్నారు.