హైదరాబాద్

వీర బ్రహ్మేంద్ర స్వామి జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్: విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని దిల్‌సుఖ్‌నగర్ మధురాపురి కాలనీలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహంచా రు. దిల్‌సుఖ్‌నగర్ పురవీధులన్ని భక్తి గీతాలతో మారు మోగాయి. కార్యక్రమానికి ఎల్‌బినగర్ మాజీ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విశ్వకర్మలందరు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వేణు, రామాచారి పాల్గొన్నారు.
పరిగి: విశ్వకర్మలు అభివృద్ధి చెందుటకు నా వంతు కృషి చేస్తానని పరిగి మాజి ఎమ్మెల్యే టీ.రాంమోహన్ రెడ్డి అని న్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో విశ్వకర్మ జయంతి వేడకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వకర్మలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుటకు కావాలసిన నిధులు మంజూరి చేయిస్తానని అన్నారు. నేటికి గ్రామాల్లో విశ్వకర్మలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండల కాంగ్రెస్ నాయకులు, విశ్వకర్మ నియోజక వర్గం నాయకులు ప్గాన్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: బాలాజీనగర్ డివిజన్ కేపీహెచ్‌బీకాలనీలో గల 3వ ఫేజ్‌లో పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సోమవారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయంలో విశ్వకర్మ భగవానుడి యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పన్నాల కావ్య హరిష్‌రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు మహబూబ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి పాండురంగాచారి, కోశాధికారి ప్రభాకర్‌చారి, జాయింట్ సెక్రటరీ ఎన్.వి.్ఫణీ బాబు, కమిటీ సభ్యులు సాంబయ్య, గోవర్ధన్, స్వరూప, సరస్వతీ, తుల్జ, చెన్నరెడ్డి పాల్గొన్నారు.
ఐడీపీఎల్ కాలనీలో..
ఐడీపీఎల్ కాలనీలోని శ్రీసీతారామ కల్యాణ మండపంలో విశ్వకర్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కేఎం గౌరీష్, కిషోర్‌చారి, బాల్‌రాజ్, వెంకటేశ్ చారి, రవిందర్ చారి, కరుణాకర్ చారి, ప్రవీన్ చారి, ఉపేందర్ చారి, బాలరాజ్ చారి పాల్గొన్నారు.
జగద్గిరిగుట్టలో...
జగద్గిరిగుట్ట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కల్యాణ మండపంలో విశ్వకర్మ జయంతి పూజలు జరిగాయి. కార్యక్రమానికి తాజా మాజీ ఎమ్మెల్యే కేపీ వివేక్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. రఫీ, రాజేందర్ రెడ్డి, బాల్‌రాజ్, ప్రభుచారి, శివచారి, శ్రీను, కృష్ణ, రాకేశ్ పాల్గొన్నారు.
షాబాద్: షాబాద్ మండల కేంద్రం లో సోమవారం విశ్వకర్మల జయంతి ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మలందరు కలిసి బైకు ర్యాలీ నిర్వహించారు. విశ్వకర్మ చిత్ర పట్టానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాక్షుడు రమేష్ చారి, కార్యదర్శి శ్రీనివాస చారి, మధుసుదన చారి, రామ చారి పాల్గొన్నారు.
షాబాద్: సమాజ సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందుండాల న్ని రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్యులు సంఘం అధ్యక్షుడు సరాపు రమేష్ గుప్త అన్నారు.
సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షాద్‌నగర్ ఆర్యవైశ్య సంఘం నుంచి నోట్ పుస్తకాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 20 వేల నోట్ పుస్తకాలు పంపిణీ చేశామని అన్నారు. కార్యక్రమంలో పుస్తక కమిటీ జిల్లా అధ్యక్షుడు గుండె సురేష్, పాపిశెట్టి రాములు, బాదం సుధాకర్, శ్రీరాం, శ్రీనివాస్‌గుప్త, సంతోష్ గుప్త పాల్గొన్నారు.