హైదరాబాద్

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పిలుపునిచ్చారు. దాస్‌వాస్ సంస్థ అధ్వర్యంలో ‘ప్రకృతి - పర్యావరణ’ అంశంపై అవగాహన సదస్సును రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వామి గౌడ్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహరం కార్యక్రమాన్ని నిర్వహించిందని పేర్కోన్నారు. పర్యావరణ కోసం ప్రతి ఇంట్లో చెట్లను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి గౌతమి, తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సంస్థ ప్రతినిధులు రమేష్, సురభి, రాజ్యలక్ష్మీ, నాగరాజు రెడ్డి పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో పర్యావరణ అంశంపై విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవం
కులకచర్ల, సెప్టెంబర్ 17: వచ్చే సంవత్సరం రాష్ట్రంలో తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లద రావు అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా జరిపేందుకు పార్టీలు జంకుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో పూడూరు మల్లేశం, కాటని అంజిలప్ప పాల్గొన్నారు.
ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి
కుషాయిగూడ, సెప్టెంబర్ 17: ఉప్పల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ బలోపెతానికి కృషి చేస్తామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్నారు.
కాప్రా సర్కిల్ పరిధి కుషాయిగూడ చక్రిపూరం చౌరస్తాలో కాంగ్రెస్ జెండా పండుగకు ముఖ్య అతిధులుగా రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి హాజరై ఆవిష్కరించారు. విలేఖరులతో మాట్లాడుతూ ఉప్పల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ బలోపెతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పత్తికుమార్, గోపాల్‌యాదవ్, యాదిరెడ్డి, పెద్ది శ్రీనివాస్ గుప్త, కాసుల పోచయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, సతీష్ పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్
నార్సింగి, సెప్టెంబర్ 17: గుడిమల్కాపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రామాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. భారత ప్రధాన మంత్రి మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. బీజేపీ నాయకులు దేవర కరుణాకర్, దేవర శ్రీను, డిజ్వర్‌సింగ్ పాల్గొన్నారు.
కంటి ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
నార్సింగి, సెప్టెంబర్ 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో 20సంవత్సరాల పాటు కొనసాగుతారని కేంద్ర బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కార్వాన్ నియోజకవర్గం ఇన్‌చార్జి దేవర కరుణాకర్, కన్వీనర్ ఆకుల గోవర్ధన్ రావు ఆధ్వర్యంలో మోదీ జన్మదిన వేడుకలు జరిగాయి. సోమవారం ఉదయం రోగులకు సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో పండ్లును పంచి పెట్టారు.