హైదరాబాద్

గణేష్ నిమజ్జనంలో డీజేకు అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్: శ్రీ గణేష్ నిమజ్జనంలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు డీజేను సీజ్ చేస్తామని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వివరించారు. మంగళవారం పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏసీపీ సురేందర్ మాట్లాడుతూ భక్త్భివంతో గణేష్ నిమజ్జనోత్సవాలను నిర్వహించుకోవాలే తప్పా మద్యం సేవించి ఉత్సవాలను చేస్తే సహించేది లేదని అన్నారు. నిమజ్జనం రోజు ప్రత్యేకంగా డ్రంక్ ఆండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి స్థానిక బొబ్బిలి చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, ప్రతి ఒక్కరు అక్కడికే వెళ్లే విధంగా చూడాలని అన్నారు. గణేష్ విగ్రహాల ఊరేగింపును సకాలంలో పూర్తి చేసేందుకు కమిటి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్ నేత బండారు రమేష్ మాట్లాడుతూ భక్తిశ్రద్దలతో గణేష్ నిమజ్జన ఉత్సవాలు నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో షాద్‌నగర్ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ విజయభాస్కర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య,పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: సకల విజ్ఞాలు తొలగించే ఆది దేవున్ని నిష్టతో పూజిస్తే జీవితం సుఖంగా ఉంటుందని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని పల్లెచెరువు, ప్రేమావతిపేట్, భవానీకాలనీ, గగన్‌పహాడ్, మధుబన్‌కాలనీ, బాబుల్‌రెడ్డినగర్, మార్కండేయనగర్, దుర్గానగర్, ఎన్టీ ఆర్ నగర్ బస్తీల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి వినాయక మండపాలలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖంగా సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో బస్తీనాయకులు పాల్గొన్నారు.
ప్రజలంతా సంతోషంగా ఉండాలి
రాజేంద్రనగర్: గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాజేంద్రనగర్ మాజీ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ గణేష్‌నగర్ బంగారు మైసమ్మ ఆలయం ప్రాంగణంలో గణనాథుని మండపంలో మాజీ ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖ:సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భగవంతుడు పంటలు సకాలంలో పండేలా ఆశీర్వదించాలని కోరారు. గాంధీనగర్ గణేష్‌నగర్ మండపంలో భక్తుల గణనాథునికిపూజలు నిర్వహించుకున్నారు.
ఆమనగల్లు: ఆమనగల్లు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో భక్తిశ్రద్దలతో ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధులు మంగళవారం సురసముద్రం నిమజ్జనం చేశారు. పట్టణంలోని పలు పురవిదుల గుండ వినాయక విగ్రహలను ఊరేగింపు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ మున్సిపాల్ కమిషనర్ రామ్మోహన్ ఎస్‌ఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఆమనగల్లు మండలంతో పాటు వివిధ గ్రామాల్లో మండపాలలో ప్రతిష్టించిన గణనాథులు భక్తులు పూజలు నిర్వహించారు. మంగళవారం మార్కండేయ యువజన సంఘం ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహలకు భక్తులు హజరై పూజలు చేస్తున్నారు ఆయా మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భజనలు చేస్తున్నారు. దీంతో మండపాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
నిమజ్జనం ప్రశాంతం
తాండూరు: ప్రతి ఏటా మాదిరిగానే తాండూరు పట్టణ పరిసరాలలో గణేష్ నిజ్జన మహోత్సవం సోమవారం మధ్యాహ్నాం నుంచి మంగళవారం ఉదయం వరకు కొనసాగింది.
గణేష్ మండపాలను దర్శించుకున్న నేతలు
శేరిలింగంపలి: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, నేతలు పాల్గొంటుండడంతో మండపాల వద్ద హడావుడి నెలకొంది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఏర్పాటు చేసిన వినాయకుడిని శేరిలింగంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ దర్శించుకున్నారు. ఇందులో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నీలం రవీందర్, ఎం.రాజు యాదవ్, సంజీవ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నేత మొవ్వా సత్యనారాయణ మియాపూర్ పరిధిలోని వివిధ వినాయక మండపాలను దర్శించుకున్నారు. ఇందులో డీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఎండి అక్బర్ ఖాన్, మనే్నపల్లి సాంబశివరావు, మచ్చ రాజేష్ పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ దుర్గం వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు జ్ఞానేంద్ర ప్రసాద్, యూత్ సభ్యులు జనార్ధన్ గౌడ్ పాల్గొన్నారు. నల్లగండ్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆదయ్య పాఠశాల ఘనత
బేగంపేట, సెప్టెంబర్ 18: లష్కర్‌లో అనేక మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఘనత కేవలం ప్రభుత్వ ఆదయ్య స్మారక పాఠశాలకే దక్కుతుందని రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ అత్తేల్లీ అరుణగౌడ్ అన్నారు. రాణిగంజ్‌లో ప్రభుత్వ అదయ్య స్మారక పాఠశాలలో మంగళవారం ఏంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చరిత్ర-ప్రదర్శన సమావేశం నిర్వహించారు. అనేక మంది పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు అందించిన ఘనత కలిగిన ఈ పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకుంది. పాఠశాల 1916లో స్థాపించడం జరిగిందని, నిజాం కాలంలో స్థాపించిన ఈ పాఠశాల నగరంలో ఎంతో పేరు గాంచిందని అరుణగౌడ్ తెలిపింది. కార్యక్రమంలో డీప్యూటీ డీఈవో సురేష్‌కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పాండురంగయ్య, స్కూల్ వ్యవస్థాపక సభ్యులు హరిచరన్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.