హైదరాబాద్

రాష్ట్రంలో ఒంటరిగా పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మినార్వ కాంప్లేక్స్‌లో అఖిషా ఫౌండేషన్‌కు చెందిన బీజేపీ నేత బండపల్లి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓంటరిగానే పోటీ చేసి అత్యదిక సీట్లు గెలుచుకుంటామని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వారసత్వ రాజకీయాలు కోనసాగిస్తున్నాయని, అదే తరహాలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కొనసాగుతుందని చెబుతూ ఈ రెండు పార్టీలకు ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఆధికారాన్ని అప్పగిస్తే ముందస్తూ ఎన్నికలకు ఎందుకు వెళ్లారని, ఈ విషయంలో కేసీఆర్ సమాధానం చేప్పాలని డిమాండ్ చేశారు. జెమిలి ఎన్నికలకుసై అంటూ ఒక్క నెలలోనే యుటర్న్ ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే జాతీయ స్థాయిలో మోడీ చేసిన అభివృద్ధి పనుల ముందు తన పార్టీ నిలువలేదని భావించి ఓటమి భయంతో ముందస్తు ఎన్నికలకు వేళ్లారని లక్ష్మణ్ మండిపడ్డారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్, నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్‌లు వంటి పథకలా అమలు, దళితులకు మూడు ఏకరాల భూమి ఇచ్చేంత వరకు ఓటు అడగను అని చెప్పిన.. కేసీఆర్ మాటా ఏమయిందని అని లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ బీజేపీ నేత బండపల్లి సతీష్ గౌడ్ పాల్గొన్నారు.

గడువు పెంచినా.. స్పందించని దరఖాస్తుదారులు
ఉప్పల్, సెప్టెంబర్ 19: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) పథకం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ రుసుం చెల్లించని దరఖాస్తుదారులందరిని సంప్రదించి అసలు వారికి ఎస్‌ఎంఎస్‌లు సమాచారం అందిందా లేదా తెలుసుకోవాలని అధికారులను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్ డాక్టర్ బీ.జనార్ధన్ రెడ్డి ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి 9800 మంది దరఖాస్తు చేసుకుని ప్రారంభ రుసుం చెల్లించలేదు. వీరికి తాజా ప్రభుత్వం రానున్న అక్టోబర్ 15 నాటికి ప్రారంభ ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ధ్రువీకరణ పత్రాలు సరిగా లేవని సంబధిత ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నిత్యం కార్యాలయం చుట్టూ తిప్పుకోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం మరో అవకాశం కల్పించినా దరఖాస్తుదారుల్లో స్పందన కరువైంది. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో జిల్లా కలెక్టర్ల ద్వారా ఎన్‌ఓసీ (నిరభ్యంతర ప్రమాణ పత్రాలు) అందిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో ఈ నెల 27 వరకు పరిశీలనలో ఉన్న 1349 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదిన పరిష్కరించి తుది ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. జోన్ల వారీగా పని భారం తక్కువ ఉన్న యూనిట్లను గుర్తించి అదనంగా తహశీల్దార్లకు బాధ్యతలు అప్పగించి రెండు, మూడు రోజుల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్ బాలకృష్ణ, సీపీవో శ్రీనివాస్, టీఎస్‌ఐ పాస్ నరేంద్ర, సీఈవో సుబ్రమణ్యం పాల్గొన్నారు.