హైదరాబాద్

ఓటు నమోదుపై చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు అర్హులైన వారంత ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పిలుపునిచ్చారు. బుధవారం జీహెచ్‌ఎంసీ నగరంలోని పలు చోట్ల ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. జనవరి 1వ తేదీ 2018 నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారంతా ఓటర్లుగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. అవకాశం ఈనెల 25వ తేదీ వరకు కల్పించినట్లు వివరించారు. ఓటరు చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ట్యాంక్‌బండ్ వద్ద ఎస్‌హెచ్‌జీ మహిళలతో మానవహారం నిర్వహించారు.

గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 19: భక్తుల నుంచి ఘనంగా పూజలందుకునే గణేషుడి నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పోలీసు, నీటిపారుదల, రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్, జలమండలి తదితర శాఖల సమన్వయంతో ఈ విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ ద్వారా రూ. 16.86 కోట్లతో వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వ ఇవరించారు. ఈనెల 23వ తేదీ ఆదివారం జరిగే నిమజ్జనానికి గ్రేటర్‌లో మొత్తం 117 క్రేన్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. 35 ప్రాంతాల్లో క్రేన్లను, మరో 96 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు. భారీ విగ్రహాలను మండపాల నుంచి వాహనంలోకి ఎక్కించేందుకు మొబైల్ క్రేన్లను వినియోగించనున్నట్లు కమిషనర్ తెలిపారు. సాగర్, సరూర్‌నగర్ చెరువుల వద్ద ప్రతి సంవత్సరం నీటి పారుదల శాఖ ఏర్పాటు చేయాల్సిన క్రేన్లను ఈసారి జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయనుంది. నిమజ్జనం జరిగే అన్ని చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు, ఒక్క హుస్సేన్‌సాగర్ వద్దనే పది మంది గత ఈతగాళ్లను, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 11 స్పీడ్ బోట్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. విద్యుత్ విభాగం ద్వారా సుమారు రూ. 94.21లక్షల వ్యయంతో 34926 తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 15 కిలోమీటర్ల మేరకు బ్యారికేడింగ్ చేయనున్నట్లు, శోభాయాత్ర ప్రధాన రూట్‌లోని 15 ప్రాంతాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లను వేయనున్నట్లు వివరించారు. రోడ్లు, భవనాలు, విద్యుత్ విభాగాల ఆధ్వర్యంలో 75 జనరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. నిమజ్జనం తిలకించేందుకు వచ్చిన జనం సౌకర్యార్థం మూడు లక్షల వాటర్ ప్యాకెట్లను, మూడు వాటర్ శిబిరాల్లో అందుబాటులో ఉంచనున్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ మొత్తం 48 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. నిమజ్జన యాత్ర జరిగే ప్రధాన రూట్‌లో 38 ఫైర్ ఇంజన్లను, జీహెచ్‌ఎంసీ తరపున గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా రోడ్డుపై గుంతలు ఏర్పడినా, అప్పటికపుడే వాటిని పూడ్చేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 20 గణేష్ నిమజ్జన కొలనులను శుభ్రపరిచి, వాటిలో శుభ్రమైన నీటిని నింపి సిద్ధంగా ఉంచారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువుల్లో నిమజ్జనం చేసే విగ్రహాలను అప్పటికపుడే తొలగించనున్నట్లు విలేఖరుల సమావేశంలో కమిషనర్ దాన కిషోర్ తెలిపారు.

మొహర్రానికి ప్రత్యేక ఏర్పాట్లు
త్యాగానికి ప్రతికగా ఓ వర్గం ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే మొహర్రం ఊరేగింపులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. డబీర్‌పురాలోని సుప్రసిద్ద బీబీకా ఆలం నుంచి ఈ నెల 21వ తేదీన నిర్వహించననున్న మొహర్రం ఊరేగింపునకు జీహెచ్‌ఎంసీతో ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. బీబీకా ఆలం ఊరేగింపు మార్గంతో పాటు అన్ని అశూర్‌ఖానాల మార్గంలో రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం తదితర మొత్తం రూ.2.89 కోట్లతో 44 పనులను చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. మొహర్రం రూట్‌లో ఎప్పటికపుడు పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు వీలుగా 95 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరిగే మొహర్రం ఊరేగింపుల్లో వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

హత్యాయత్నానికి పాల్పడ్డ తండ్రి అరెస్టు
* హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు
* డీసీపీ ఏఆర్ శ్రీనివాస్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 19: కూతురు, అల్లడిపై హత్యాయత్నానికి పాల్పడ్డ మనోహర చారిని సంజీవరెడ్డినగర్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఇది పరువు హత్య కాదని, కేవలం కుమార్తె తమను కాదని వివాహం చేసుకుందన్న కోపంతోనే దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిపారు. ఈనెల 12న నిందితుని కుమార్తె మాధవి, సందీప్ అల్వాల్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆనాటి నుంచి కుమార్తెతో మాట్లాడేందుకు చారి ప్రయత్నించినా నిరాకరించింది. వారం రోజులుగా మద్యం సేవిస్తూ కుమార్తె గురించే ఆలోచించాడు. పథకం ప్రకారం బుధవారం మధ్యాహ్నం కుమార్తెకి ఫోన్ చేసి చూడాలని ఉంది ఒక్కసారి రావాలంటూ అభ్యర్ధించాడు. నిజమని నమ్మిన మాధవి భర్తతో కలిసి ఎర్రగడ్డకు చేరుకున్న ఇద్దరిపై దాడి చేసి పారిపోయాడు. నిందితున్ని బీఎస్ మక్తాలో అదుపులోనికి తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.